తెలంగాణ

telangana

Central Team AP Tour: వరద ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి కేంద్ర బృందం పర్యటన

By

Published : Nov 26, 2021, 10:51 AM IST

భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం (Central Team visit at floods effected areas) ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. నేటి నుంచి మూడు రోజుల పాటు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించి ఆస్తి, ప్రాణ నష్టాన్ని అంచనా వేయనుంది.

Central Team AP Tour, ap rains 2021
వరద ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి కేంద్ర బృందం పర్యటన

Andhra pradesh floods 2021 : ఆంధ్రప్రదేశ్​లో జరిగిన వరద నష్టం అంచనా వేసేందుకు.. కేంద్ర బృందం (Central Team tour in flood effected areas) ఆ రాష్ట్రానికి రానుంది. నేటి నుంచి మూడు రోజులపాటు.. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనుందని విపత్తుల శాఖ కమిషనర్​ కన్నబాబు తెలిపారు. కేంద్ర హోంశాఖ సలహాదారు కునాల్ సత్యార్ధి నేతృత్వంలో రెండు బృందాలు పర్యటించనున్నారని వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖకు స్పందించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఈ మేరకు బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపుతోంది. కేంద్రం నుంచి వచ్చే ఏడుగురు సభ్యులు.. రెండు బృందాలుగా విడిపోయి మూడు జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ నెల 26న చిత్తూరు, 27న చిత్తూరు, కడప, 28న నెల్లూరు జిల్లాల్లో పర్యటించి వరద నష్టం అంచనా వేస్తారు. 29న జగన్​తో భేటీ అవుతారు.

లేఖలు రాసి చేతులు దులుపుకున్నారు: జీవీఎల్

జగన్ సహాయం కోరిన వెంటనే.. కేంద్రం స్పందించి అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపుతోందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు(mp gvl news) స్పష్టం చేశారు. అయితే.. వరద సహాయక చర్యల విషయంలో మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదని జీవీఎల్‌ ఆరోపించారు. విపత్తు సహాయ నిధి కింద గతంలో కేంద్రం ఇచ్చిన నిధులను ఎందుకు ఖర్చు చేయలేదని నిలదీశారు. కేవలం లేఖలు రాసి చేతులు దులుపుకోవాలనే ఉద్దేశ్యంలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ప్రజల వద్దకు కాకుండా.. ప్యాలెస్ నుంచే జగన్ ప్రభుత్వ పాలన చేయాలని నిర్ణయించిందా? అని ప్రశ్నించారు. తక్షణం ప్రజలకు క్షమాపణ చెప్పి.. సహాయక చర్యలు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. బీసీ గణన తీర్మానంపై స్పందించిన జీవీఎల్.. తన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఏపీ ప్రభుత్వమే బీసీ కులాల జనాభా లెక్కింపు ఎందుకు చేపట్టకూడదో చెప్పాలన్నారు.

ప్రభుత్వ పరిహారం..

వరదలు, వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఏపీ మంత్రి పేర్నినాని (Minister Perni nani react on rains) ఇదివరకే స్పష్టంచేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ఒక్కో కుటుంబానికి రూ. 2 వేలు, ఇతర నిత్యవసరాలు అందించాలని నిర్ణయించిన్నట్లు తెలిపారు. పునరావాసం కోసం అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 104 సేవలను నాలుగు జిల్లాలకు మరింత విస్తృతంగా విస్తరిస్తున్నట్లు వివరించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్న 104 సేవలు ఉపయోగించుకోవచ్చని మంత్రి (minister perni nani latest news) తెలిపారు. విధి నిర్వహణలో ముగ్గురు చనిపోయారని తెలిపారు. వారి కుటుంబాలను ఆదుకోవడానికి రూ. 25 లక్షల పరిహారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

ఇదీ చదవండి:Son Murdered Mother: పెళ్లి చేయట్లేదనే కోపంతో... తల్లిని చంపిన కొడుకు

ABOUT THE AUTHOR

...view details