తెలంగాణ

telangana

మా నిర్ణయం అదే.. వెనక్కి తగ్గేది లేదు: కేంద్రం

By

Published : Jul 25, 2022, 8:59 PM IST

Vishaka Steel Plant: ఏపీలో ఓ వైపు విశాఖ స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతుండగా.. మరోవైపు కేంద్రం మాత్రం తాము వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేసింది. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

విశాఖ స్టీల్​ ప్లాంట్​
విశాఖ స్టీల్​ ప్లాంట్​

Vishaka Steel Plant: ఆంధ్రప్రదేశ్​లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని వెల్లడించింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్నట్టు తేల్చి చెప్పింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి ఫాగన్‌సింగ్‌ కులస్తే లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2021-22లో విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.913కోట్లు లాభం వచ్చిందని మంత్రి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details