తెలంగాణ

telangana

భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిట... దుర్గమ్మ సేవలో ప్రముఖులు

By

Published : Oct 8, 2019, 12:40 PM IST

వైభవంగా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. దుర్గమ్మను దర్శించుకునేందుకు సామాన్య భక్తులతోపాటు ప్రముఖులు బారులు తీరుతున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, భాజపా రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమ్మవారిని దర్శించుకున్నారు.

దుర్గమ్మ సేవలో ప్రముఖులు

దుర్గమ్మ సేవలో ప్రముఖులు

దసరా శరన్నవరాత్రులు చివరి దశకు చేరుకున్నాయి. ఆఖరి రోజు బెజవాడ దుర్గమ్మ శ్రీ రాజ రాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తున్నారు. భారీగా చేరుకుంటున్న భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. అర్ధరాత్రి 2 గంటల నుంచే రద్దీ పెరిగింది. క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి. భవానీలతో కృష్ణవేణి ఘాట్‌ నిండిపోయింది. ఆ తల్లి చల్లని చూపు కోసం సామాన్య భక్తులతోపాటు ప్రముఖులూ కొండపైకి చేరుకుంటున్నారు. ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, భాజపా ఏపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఉన్నతాధికారులు కొందరు దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.

Intro:Ap_vsp_46_08_virigina_rail_patta_Av_AP10077_k.Bhanojirao_8008574722
విశాఖ జిల్లా కసింకోట మండలం పరవాడ పాలెం సమీపంలోని రంగుబొలు గెడ్డ వద్ద రైలు పట్టా విరిగింది గమనించిన స్థానికులు రైల్వే అధికారులు విషయం తెలిపారు విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో రైలు పట్టా విరగడంటొ ఈ ప్రాంతంలోనే గూడ్స్ రైలు నిలిచిపోయింది రైల్వే సిబ్బంది వచ్చి విరిగిన రైలు పట్టా మరమత్తు చేపడుతున్నారు
Body:విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే మార్గంలోనే రైలు పట్టా కలవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఉదయం వెళ్లాల్సిన జన్మభూమి ఉదయ ఎక్స్ప్రెస్ రైలు దువ్వాడ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారుConclusion:దసరాకి ఇంటికి వెళదామని రైల్లో ప్రయాణం చేసేవారికి పట్టా విరగడంతో రైలు రాకపోకలు అంతరాయం ఏర్పడడంతో స్టేషన్లో నిరీక్షించాల్సి వచ్చింది

ABOUT THE AUTHOR

...view details