తెలంగాణ

telangana

ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా విరిగిన స్టీరింగ్.. అందులో సుమారు 60 మంది..

By

Published : Jul 27, 2022, 12:14 PM IST

Bus steerig broke: గోతుల మయంగా ఉన్న రహదారిలో వెళుతున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్‌ విరిగిపోవడంతో.. అదుపుతప్పి తుప్పల్లోకి దూసుకెళ్లింది. బస్సు ఏపీలోని తాడేపల్లిగూడెం నుంచి సుమారు 60 మంది ప్రయాణికులతో రావులపాలెం బయలుదేరగా.. జువ్వపాలెం వద్ద రోడ్డుపై గోతులు ఉన్నాయి. వీటిలోంచి వెళుతుండగా బస్సు స్టీరింగ్‌ ఒక్కసారిగా విరిగిపోయింది.

bus steerig broke
bus steerig broke

Bus steerig broke: గోతుల మయంగా ఉన్న రహదారిలో వెళుతున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్‌ విరిగిపోవడంతో అదుపుతప్పి తుప్పల్లోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు తాడేపల్లిగూడెం నుంచి సుమారు 60 మంది ప్రయాణికులతో రావులపాలెం బయలుదేరింది. జువ్వపాలెం వద్ద రోడ్డుపై గోతులు ఉన్నాయి. వీటిలోంచి వెళుతుండగా బస్సు స్టీరింగ్‌ విరిగిపోయింది.

అదుపు తప్పి పక్కనున్న ఏలూరు కాలువ వైపు బస్సు దూసుకెళ్తుండగా టైర్లకు మట్టి గుట్టలు అడ్డురావడం, డ్రైవర్‌ సమయస్ఫూర్తితో బ్రేకులు వేయడంతో తుప్పల్లోకి వెళ్లి ఆగిపోయింది. త్రుటిలో ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ఆర్టీసీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, ప్రయాణికులకు మరో బస్సును ఏర్పాటు చేసి గమ్యస్థానాలకు చేర్చారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details