తెలంగాణ

telangana

biometric attendance in Hospitals : ఇక నుంచి డాక్టర్​సాబ్ సమయానికి వస్తారు..

By

Published : Nov 15, 2021, 7:00 AM IST

రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్ రావు.. ఆ శాఖ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉన్నతాధికారులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తూ శాఖ పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించారు. చాలా రోజులుగా వైద్యులు, సిబ్బంది ఆస్పత్రికి సమయానికి రావడం లేదని వస్తున్న ఫిర్యాదుపై మంత్రి చర్యలకు ఉపక్రమించారు. ఇక నుంచి ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించారు.

biometric attendance in Hospitals
biometric attendance in Hospitals

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన హరీశ్ రావు(Telangana health minister Harish Rao).. ఆ శాఖ పురోగతిలో వేగం పెంచారు. ఇప్పటికే వైద్యులు, సిబ్బంది పనితీరు ప్రామాణికంగా ప్రోత్సాహకాలు ఉంటాయని ప్రకటించిన మంత్రి.. తాజాగా.. సమయపాలన(Time sense) పాటించని వైద్యులు, సిబ్బందిపై కఠిన వైఖరి అవలంబించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని(biometric attendance in Hospitals) తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సహా జిల్లా ఉన్నతాధికారులూ తరచూ ఆకస్మిక తనిఖీలను నిర్వహించాలని, తద్వారా అప్రమత్తత పెంపొందించేలా చర్యలు చేపట్టాలని వైద్యఆరోగ్య శాఖ(Telangana health ministry) భావిస్తోంది. ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు(Telangana health minister Harish Rao) నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

అడుగడుగునా అలసత్వమే..

వైద్యఆరోగ్యశాఖ(Telangana health ministry)లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని బోధనాసుపత్రుల దాకా అన్ని స్థాయుల్లోనూ సమయపాలనపై అడుగడుగునా అలసత్వమే కనిపిస్తోంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ విధులు నిర్వర్తించాల్సి ఉండగా.. అన్ని స్థాయుల ఆసుపత్రుల్లోనూ ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నారు. ఆలస్యంగా విధులకు హాజరు కావడం.. త్వరగా వెళ్లిపోవడం ఆనవాయితీగా మారింది. కొన్నిచోట్ల వంతులవారీగా వస్తున్నారని.. వారానికి ఒకటి, రెండు రోజులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ విషయంపై పత్రికల్లో కథనాలు వచ్చిన సందర్భాల్లో ఉన్నతాధికారులు హడావుడి చేయడం.. మళ్లీ యథాతథ స్థితికి చేరుకోవడం సాధారణమైంది. సమయపాలనను చక్కబెట్టేందుకు గతంలో బయోమెట్రిక్‌ విధానాన్ని(biometric attendance in Hospitals) ప్రవేశపెట్టినా ఆచరణలో విఫలమైంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. వైద్యులే సమయపాలన పాటించకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది గురించి అడిగేవారే కరవయ్యారు.

వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా హరీశ్‌రావు(Telangana health minister Harish Rao) బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని స్థాయుల ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన(time sense) పాటించేలా చర్యలు చేపట్టాల్సిందేనని మంత్రి(Telangana health minister Harish Rao) ఆదేశించడంతో వైద్యశాఖ మరోసారి దీనిపై దృష్టిపెట్టింది. అన్ని ఆసుపత్రుల్లోనూ బయోమెట్రిక్‌ విధానాన్ని(biometric attendance in Hospitals) అమలు చేయాలని నిర్ణయించారు. ఏరోజుకారోజు హాజరు నివేదికను ఉన్నతాధికారులకు పంపించేలా చర్యలు చేపట్టడంతో పాటు ఆకస్మిక తనిఖీలనూ నిర్వహిస్తారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details