తెలంగాణ

telangana

డీఆర్‌సీ కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌లకు బ్యాలెట్ బాక్సులు

By

Published : Dec 1, 2020, 11:01 PM IST

చెదురుమదురు ఘటనలు మినహా బల్దియా ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 149 డివిజన్లకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులను 30 డీఆర్​సీ కేంద్రాలకు సీల్‌ వేసి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద నిరంతరం సీసీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు.

డీఆర్‌సీ కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌లకు బ్యాలెట్ బాక్సులు
డీఆర్‌సీ కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌లకు బ్యాలెట్ బాక్సులు

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఓటర్లు నిక్షిప్తం చేసిన బ్యాలెట్‌ బాక్సులకు సీల్‌వేసి పోలీసుల 30 డీఆర్​సీ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌రూమ్‌లకు సిబ్బంది చేరవేశారు. ఎల్బీ నగర్‌ జోన్‌లో 5, చార్మినార్‌ జోన్‌లో 6, ఖైరతాబాద్ ‌జోన్‌లో 5, సికింద్రాబాద్ ‌జోన్‌లో 5, శేరిలింగంపల్లి జోన్​లో 4, కూకట్​పల్లి జోన్‌లో 5 డీఆర్​సీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లకు పీవోలు, ఏపీవోలు బ్యాలెట్ బాక్సులను పటిష్ఠ భద్రత మధ్య తరలించారు.

స్ట్రాంగ్‌రూమ్‌లు సహా లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత కల్పించారు. సాధారణ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు నిరంతరం పహారా కాస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద నిరంతరం సీసీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు. బల్దియా ఎన్నికలకు సంబంధించి మొత్తం 28 వేల 683 బ్యాలెట్ బాక్సులు వినియోగించారు. లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు భద్రతాపరమైన అన్నీ చర్యలు తీసుకున్నామని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ సీపీలు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ముగిసిన గ్రేటర్​ పోలింగ్.. ఆసక్తి చూపని నగరవాసులు

ABOUT THE AUTHOR

...view details