తెలంగాణ

telangana

వైకాపా ప్రభుత్వానికి ఎమ్మెల్యే బాలకృష్ణ వార్నింగ్​

By

Published : Jan 6, 2021, 9:43 PM IST

వైకాపా ప్రభుత్వంపై ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతులతో పెట్టుకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. పాడై పోయిన పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో మూడు రోజులు ఆయన పర్యటించనున్నారు.

MLA Balakrishna Warning to ycp Government
వైకాపా ప్రభుత్వానికి ఎమ్మెల్యే బాలకృష్ణ వార్నింగ్​

ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మూడు రోజులు పర్యటించనున్నారు. మొదటి రోజులో భాగంగా గోళ్లపురంలో కంది పంట పరిశీలించారు. వైకాపా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం రాక్షస పాలన కొనసాగుతోందని మండిపడ్డాడు.

రైతుపక్ష పార్టీనా?..

అన్నదాతలను అన్ని విధాల ఆదుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బాలకృష్ణ హెచ్చరించారు. రైతుపక్ష పార్టీ అని అధికారంలోకొచ్చి ఇప్పుడేమో రైతు నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. వైకాపా నాయకులకు చట్టమంటే భయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకాపా నేత తమ్ముడు పేకాటలో దొరికితే పది వేలు జరిమానా కట్టారు. తిరిగి వచ్చి మళ్లీ పేకాట ఆడుతాననడం చట్టమంటే భయం లేదనడానికి నిదర్శనం. రైతుల వెంట తెదేపా ఎల్లప్పుడూ ఉంటుంది. వారి కోసం పోరాటాలు కొనసాగిస్తుంది.

-నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యే

ఇదీ చూడండి:సంక్షేమ పథకాల అమలులో భేష్ : పల్లా రాజేశ్వర్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details