తెలంగాణ

telangana

"బాటిళ్లన్నీ అమ్మారా.. ఏమైనా మింగేశారా?" మద్యం దుకాణాల్లో సర్కారు ఆడిట్..!

By

Published : Nov 26, 2021, 7:48 PM IST

Govt Audit on Wine Shops in AP: ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలపైనా ఆడిట్ నిర్వహిస్తోంది. ఇటీవల ప్రభుత్వ మద్యం షాపులకు సంబంధించిన సొమ్మును.. కొందరు సిబ్బంది దారి మళ్లించిన ఘటనలు వెలుగుచూడటంతో.. ఆడిటింగ్ చేయాలని ఆ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది.

"బాటిళ్లన్నీ అమ్మారా.. ఏమైనా మింగేశారా?" మద్యం దుకాణాల్లో ఏపీ సర్కారు ఆడిట్..!
"బాటిళ్లన్నీ అమ్మారా.. ఏమైనా మింగేశారా?" మద్యం దుకాణాల్లో ఏపీ సర్కారు ఆడిట్..!

"బాటిళ్లన్నీ అమ్మారా.. ఏమైనా మింగేశారా?" మద్యం దుకాణాల్లో ఏపీ సర్కారు ఆడిట్..!

ఏపీ ప్రభుత్వం కొత్తగా మద్యం అమ్మకాలపైనా ఆడిట్ (Govt Audit on Wine Shops in AP) నిర్వహిస్తోంది. ఇప్పటివరకు పంచాయతీరాజ్, పట్టణ, స్థానిక సంస్థలు, సంక్షేమ వసతి గృహాల్లో లెక్కలపై ఆరా తీయగా.. తాజాగా మద్యం షాపులు ఆ కోవలోకి చేరాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వ మద్యం షాపుల్లో సొమ్మును కొందరు సిబ్బంది దారి మళ్లించిన ఘటనలు బయట పడటంతో ఆడిటింగ్ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కచ్చితమైన ఆదాయం ఎంత వస్తుంది? సిబ్బంది సరిగ్గానే జమ చేస్తున్నారా? అనే కోణంలో ఆడిటింగ్ చేపట్టనున్నారు.

మద్యం దుకాణాలపై కొరవడిన పర్యవేక్షణ

మద్యం దుకాణాల నిర్వహణ ప్రభుత్వం చేపట్టిన తర్వాత మద్యం దుకాణాల్లో సిబ్బంది(Staff main role in wine shops) కీలకంగా మారారు. బ్రేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా సరకు తేవడం, విక్రయాలు జరపడం, మళ్లీ తిరిగి డబ్బులు కట్టడం వంటి పనులన్నీ వారే నిర్వహిస్తున్నారు. ఆబ్కారీ శాఖను ఎక్సైజ్, సెబ్ పేరిట రెండు విభాగాలుగా మార్చడంతో మద్యం దుకాణాలపై పర్యవేక్షణ కొరవడింది. కొందరు సిబ్బంది ఇదే అదనుగా సొమ్మును పక్కదారి పట్టించారు.

ఆడిటింగ్​ విధానం ద్వారా..

రొంపిచర్ల, మాచవరం, మంగళగిరి వంటి చోట్ల పెద్దఎత్తున మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు చెల్లించలేదని గుర్తించారు. కొందరు బ్రెవరేజెస్​ కార్పొరేషన్ (Taking stock from Bravarages Corporation) నుంచి సరకును దారి మళ్లిస్తున్న ఆరోపణలున్నాయి. కొన్ని బ్రాండ్లను బార్లు, రెస్టారెంట్లకు అనధికారికంగా విక్రయాలు జరుపుతున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీంతో ప్రభుత్వ దుకాణాలపై ఆడిటింగ్ జరపడం ద్వారా ఖచ్చితమైన లెక్కలు, ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ఆడిటింగ్ విధానానికి తెరలేపింది.

తనిఖీలు చేసి..

మద్యం దుకాణాల్లో ఆడిటింగ్‌ నిర్వహించటం ద్వారా సరుకు నిల్వ(Stock in Wine shops), ప్రభుత్వ ఖాతాకు జమ చేసిన నగదు(Money deposited in Government account), ఎమ్మార్పీ ధరల అమలు(MRP implementation), సకాలంలో సిబ్బంది హాజరవుతున్నారో లేదో తనిఖీ చేసి రికార్డులను ఉన్నతాధికారులకు పంపాల్సి (Audit records send to Higher Officials)ఉంటుంది. మొదటి విడతగా జిల్లాలోని ఏ,బీ కేటగిరీల్లోని 49 మద్యం దుకాణాల్లో ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఆడిటింగ్ ప్రక్రియను జిల్లా ఆడిట్ అధికారులకు అప్పగించారు. తనిఖీలు నిర్వహించి, వినియోగదారులతో(Enquiry on Consumer satisfaction) మాట్లాడి సంతృప్తిగా ఉన్నారా? లేదా? తెలుసుకుని... ఆ వివరాలను నివేదికలో పొందుపరచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరింత జవాబుదారీతనం కోసం..

ఇక నుంచి వారంలో ఒకరోజు నిర్దేశిత మద్యం దుకాణాలను(A day in every week to be audit) తనిఖీ చేసి అక్కడి పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ ఆడిటింగ్ వలన మరింత జవాబుదారీతనం వచ్చే అవకాశముందని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇదీ చదవండి : Ap Govt Affidavit On Amaravathi: పాలనా వికేంద్రీకణ బిల్లును ఉపసంహరించుకున్నాం.. ప్రభుత్వం అఫిడవిట్

ABOUT THE AUTHOR

...view details