తెలంగాణ

telangana

Andhra pradesh students in Ukraine : ఉక్రెయిన్‌ నుంచి 22 మంది తెలుగు విద్యార్థులు నేడు స్వదేశానికి..

By

Published : Feb 26, 2022, 9:54 AM IST

Andhra pradesh students in Ukraine : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థుల్లో 22 మంది ఈరోజు దేశానికి చేరుకోనున్నట్లు రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ పేర్కొంది. బుకారెస్ట్‌ నుంచి మూడు విమానాల్లో వీరు రానున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు తెలిపారు.

Andhra pradesh students in Ukraine, telugu students return
ఉక్రెయిన్‌ నుంచి 22 మంది తెలుగు విద్యార్థులు నేడు స్వదేశానికి..

Andhra pradesh students in Ukraine : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్లో 22 మంది దిల్లీ, ముంబయిలకు ఈరోజు చేరుకోనున్నట్లు రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ ఎండీ ఎ.బాబు తెలిపారు. బుకారెస్ట్‌ నుంచి మూడు విమానాల్లో వీరు రానున్నారు. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు దిల్లీకి 13 మంది వస్తారు. మధ్యాహ్నం 2.10 గంటలకు దిల్లీ, సాయంత్రం 4 గంటలకు ముంబయి చేరే విమానాల్లో కలిపి మరో తొమ్మిది మంది రానున్నారు.

ఉక్రెయిన్‌ నుంచి వచ్చే విద్యార్థుల వివరాలు...

ఉక్రెయిన్‌ నుంచి వస్తున్న ఏపీ విద్యార్థుల్లో.. బసంత్‌ కార్తీక, గోపకుమార్‌ నాయర్‌ వర్ష, గంగరాజు నాగశ్రీకరి, తూతుకూరి హర్షిత, ఖాన్‌ టాన్జీల, రాజులపాటి అనూష, పద్మజం రేష్మ, మీనా అవంతిక, ప్రతాప్‌ తరాని, పెరువన్‌ కుజిల్‌ తాన్సిహ సుల్తానా, నీలా హర్షవర్దన్‌, దేవ వేదాంత్‌ మనోజ్‌కుమార్‌, కల్దనే సాక్విబ్‌ జాకీర్‌హుస్సేన్‌, కొకటే కెతకి, థామస్‌ గ్రీష్మ రేచల్‌, గయాన్‌ మనీషా, అక్షరా రెంజిత్‌, సుబేదార్‌ ఫైజా, నరేష్‌కుమార్‌ రాజా జ్యోతిలక్ష్మి, ఇంగ్లి హిమాన్షు, బి.అనూప్‌, కొండమారి ప్రవీణ్‌కుమార్‌ ఉన్నారు.

సహాయక కేంద్రాలకు పంపుతాం

‘‘ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవడానికి 24 గంటలు పనిచేసేలా టోల్‌ఫ్రీ నంబరు 1902తో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశాం. ఉక్రెయిన్‌లో ఉన్న వారి వివరాలను ఇక్కడి బంధువులు, స్నేహితులు ఎవరైనా టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేసి చెప్పొచ్చు. ఆ సమాచారాన్ని ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలకు పంపుతాం. 0863 2340678 నంబరుతో సహాయ కేంద్రాన్ని, 8500027678 నంబరుతో వాట్పస్‌ గ్రూపును ఏర్పాటు చేశాం. వీటితోపాటు ఏపీఎన్‌ఆర్‌టీ వెబ్‌సైట్‌ https://www.apnrts.ap.gov.in/ ద్వారా కూడా బాధితుల వివరాలను మాతో పంచుకోవచ్చు. జిల్ల్లాల్లోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూమ్‌లు పనిచేస్తున్నాయి. మండలాల్లో తహసీల్దార్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు, ఇతరుల సమాచారాన్ని సహాయ కేంద్రాల నంబర్లకు అందించడంతోపాటు ప్రస్తుతం వారు ఏ ప్రాంతంలో ఉన్నారు? వారి మెయిల్‌ అడ్రసు, ఫోన్‌ నంబర్లను కూడా అందిస్తే సాయం అందించడం సులువుగా ఉంటుంది’’ అని సీఎస్‌ గుర్తుచేశారు. ఇప్పటికే అక్కడ చిక్కుకున్న కొందరు విద్యార్థులతో తాము మాట్లాడినట్లు ప్రత్యేక అధికారి (అంతర్జాతీయ సహకారం) గీతేష్‌శర్మ తెలిపారు. ఇప్పటివరకు కంట్రోల్‌ రూమ్‌కు 130 వరకు బాధితుల తరఫున బంధువుల నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని ఏపీ డెయిరీ డెలప్‌మెంట్‌ ఎండీ బాబు పేర్కొన్నారు.

సరిహద్దు దేశాల నుంచి తీసుకొస్తాం: జైశంకర్‌

ఉక్రెయిన్‌ చిక్కుకుపోయిన వారిని సరిహద్దు దేశాలకు తరలించి, అక్కడి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా మన దేశానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ తెలిపారు. శుక్రవారం ఆయనతో సీఎం జగన్‌ ఫోనులో మాట్లాడారు. అక్కడున్న తెలుగువారిని క్షేమంగా తీసుకురావాలని, ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:Telugu Students in Ukraine : 'కళ్లుమూస్తే బతికుంటామో లేదోనని భయమేస్తోందమ్మా..'

ABOUT THE AUTHOR

...view details