తెలంగాణ

telangana

High Court Employees letter to Jagan: ముఖ్యమంత్రి జగన్​కు హైకోర్టు ఉద్యోగుల సంఘం లేఖ

By

Published : Feb 8, 2022, 7:58 PM IST

High Court Employees letter to Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు హైకోర్టు ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. పీఆర్సీ నిర్ణయంపై పునరాలోచించాలని సీఎం జగన్​ను లేఖలో కోరింది. ఐఆర్ కన్నా తక్కువగా ఫిట్​మెంట్ ఇవ్వటంతో ఉద్యోగస్థులు నిరాశతో ఉన్నారని పేర్కొంది.

Employees
Employees

High Court Employees letter to Jagan: ఐఆర్ కన్నా తక్కువగా ఫిట్​మెంట్ ఇవ్వటంతో ఉద్యోగస్తులు నిరాశతో ఉన్నారంటూ హైకోర్టు ఉద్యోగుల సంఘం ఏపీ సీఎం జగన్​కు లేఖ రాసింది. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక పక్కనపెట్టి ఫిట్ మెంట్ ఇవ్వటం సరికాదని.. కమిటీ నివేదికపై చర్చ జరిపిన తర్వాతే ఫిట్ మెంట్ ఇవ్వాలని సంఘం నేతలు కోరారు.

పీఆర్సీ నిర్ణయంపై పునరాలోచించాలని సీఎం జగన్​ను లేఖలో కోరారు. హెచ్ఆర్ఏ అంశంలో సైతం ఉద్యోగస్థులు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఐఆర్ రికవరీ లేదంటూనే.. పదవీ విరమణ తర్వాత చెల్లించమనటం సమంజసం కాదన్నారు. పెన్షనర్లకు ఇవ్వాల్సిన క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, సీపీఎస్ రద్దు, ఒప్పంద ఉద్యోగస్తుల క్రమబద్ధీకరణ, పీటీడీ ఉద్యోగస్తులకు సంబంధించిన అంశాలపై పీఆర్సీలో స్పష్టమైన ప్రకటన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంఘ నాయకులు రాష్ట్ర ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకురావటంలో విఫలమయ్యారని లేఖలో పేర్కొన్నారు. ఈ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఉద్యోగస్తులకు మరింత మెరుగైన పీఆర్సీని ఇవ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:సందడిగా ముచ్చింతల్ పరిసరాలు.. అత్యంత వైభవోపేతంగా ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details