తెలంగాణ

telangana

Amaravati JAC letter to PM: ప్రధాని మోదీకి అమరావతి ఐకాస లేఖ..

By

Published : Nov 22, 2021, 5:21 PM IST

amaravathi jac letter to pm modi

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని చేపట్టిన మహా పాదయాత్ర(Amaravati JAC letter to PM)ను పోలీసులు అడ్డుకుంటున్నారని అమరావతి ఐకాస నేతలు ఆరోపించారు. ఈ మేరకు పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని కోరుతూ ప్రధాని మోదీకి ఐకాస లేఖ రాసింది.

ప్రధాని నరేంద్ర మోదీ(Amaravati JAC letter to PM Modi)కి అమరావతి ఐకాస లేఖ రాసింది. పాదయాత్ర విజయవంతంగా పూర్తి కావడానికి జోక్యం చేసుకోవాలని లేఖలో అభ్యర్థించారు. హైకోర్టు అనుమతితో ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర చేపట్టామని పేర్కొన్నారు. పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని.. కొన్ని సందర్భాల్లో లాఠీఛార్జ్‌ చేశారని లేఖలో ఆరోపించారు. అమరావతి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మూలిస్తోందన్నారు. అమరావతి ఆర్థిక అంశాల పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. రాజధానిగా అమరావతినే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానికి ఐకాస నేతలు విజ్ఞప్తి చేశారు.

ప్రధాని మోదీకి అమరావతి ఐకాస లేఖ

ఆటంకాలెదురైనా అడుగు ఆగడం లేదు

అమరావతి రైతుల మహాపాదయాత్ర(Amravati Farmers Maha Padayatra) ఉద్ధృతంగా సాగుతోంది. 22 రోజులవుతున్నా అన్నదాత అడుగు ఆగలేదు. అదే జోరు, అదే హుషారు. పోలీసు ఆంక్షలు, వర్షపు జల్లులు అడపాదడపా ఆటంకాలు కలిగించినా.. రైతులు ముందుకే సాగారు. నెల్లూరు జిల్లాలో రాజువారి చింతలపాలెం నుంచి మొదలైన యాత్ర.. కావలి చేరుకుంది. ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరఫున.. అమరావతి పరిరక్షణ సమితికి రూ.30 లక్షల విరాళం అందజేశారు.

ఘన స్వాగతం

అమరావతి రైతులకు((Maha Padayatra Latest News) కొత్తపల్లిలో.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రజా నాయకులు, రైతు సంఘాలు ఎదురెళ్లి పూలతో స్వాగతం పలికారు. గుమ్మడికాయలతో దిష్టితీస్తూ, డప్పు చప్పుళ్లతో ఆహ్వానించారు. కావలిలో రైతులకు స్థానికులు పెద్దఎత్తున పూలతో ఘనస్వాగతం పలికారు. వర్షాలు, వరదలతో ప్రజలంతా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. అమరావతికి మద్దతుగా రైతుల అడుగులో అడుగేస్తూ ముందుకు కదిలారు. యాత్రలో వెంకటేశ్వరస్వామి రథంతో పాటు.. అల్లా, జీసస్‌కు సంబంధించిన వాహనాల ఏర్పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కోరుకుంటున్నారని రైతులు తెలిపారు.

ఇదీ చదవండి:Amaravati capital news: 'వికేంద్రీకరణే మా ప్రభుత్వ అసలైన ఉద్దేశం, కొత్త బిల్లుతో వస్తాం..'

ABOUT THE AUTHOR

...view details