తెలంగాణ

telangana

TTD: 14 మంది తితిదే బోర్డు సభ్యులకు హైకోర్టు నోటీసులు

By

Published : Oct 6, 2021, 5:23 PM IST

Updated : Oct 6, 2021, 5:40 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులపై ఏపీ హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. బోర్డు సభ్యుల్లోని 24 మందిలో 14 మంది సభ్యులపై నేరచరిత్ర ఉందని పిటిషనర్‌ తెలిపారు. 14 మంది సభ్యులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను దసరా సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.

adjournment-of-hearing-in-the-high-court-on-the-appointment-of-criminal-histories-in-the-ttd-board
adjournment-of-hearing-in-the-high-court-on-the-appointment-of-criminal-histories-in-the-ttd-board

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేర చరితులను సభ్యులుగా నియమించారని ఏపీలోని హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్​పై వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.

బోర్డు సభ్యుల్లోని 24 మందిలో 14 మంది సభ్యులపై నేరచరిత్ర ఉందని పిటిషనర్‌ తెలిపారు. నలుగురిని రాజకీయ ప్రాధాన్యతతో నియమించారని పిటిషనర్‌ ఆరోపించారు. 14 మంది సభ్యులను ఇంప్లీడ్‌ చేయాలని పిటిషనర్‌ తరుపు న్యాయవాది అశ్వినీకుమార్‌ ధర్మాసనానికి వాదనలు వినిపించారు. 14 మంది సభ్యులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను దసరా సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి :

Last Updated :Oct 6, 2021, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details