తెలంగాణ

telangana

AP Omicron Cases: ఏపీలో 28కి చేరిన ఒమిక్రాన్​ కేసులు

By

Published : Jan 5, 2022, 4:02 PM IST

AP Omicron Cases: ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. యూకే నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు, యూఎస్ నుంచి వచ్చిన మరొకరికి, విదేశాల నుంచి వచ్చిన మరో మహిళకు ఒమిక్రాన్ సోకినట్లుగా ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది.

ap Omicron cases
ap Omicron cases

AP Omicron Cases: ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. యూఎస్‌ఏ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన మరో మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. గుంటూరు మహిళతో పాటు మరో ముగ్గురు ప్రకాశం జిల్లా వాసుల్లో ఒమిక్రాన్‌ను గుర్తించారు. తాజా కేసులతో ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 28 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలోనూ ఒమిక్రాన్ బాధితుల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 94 మంది ఒమిక్రాన్ బారినపడగా... వారిలో ఇప్పటికే 37 మంది కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

ఇదీచూడండి:కరోనా హోం ఐసోలేషన్​కు కేంద్రం కొత్త రూల్స్

ABOUT THE AUTHOR

...view details