తెలంగాణ

telangana

Rajampet floods Kadapa 2021 : 'రాజంపేట వరదల్లో 38 మంది గల్లంతు'

By

Published : Nov 25, 2021, 12:26 PM IST

Updated : Nov 25, 2021, 12:43 PM IST

Rajampet floods, Kadapad floods 2021, కడప జిల్లా వరదలు, రాజంపేట వరదలు, రాజంపేట వరదల్లో 38 మంది గల్లంతు
Rajampet floods Kadapa 2021 ()

12:23 November 25

Rajampet floods Kadapa 2021 : రాజంపేట వరదల్లో 38 మంది గల్లంతు.. 25 మృతదేహాల గుర్తింపు

Rajampet floods Kadapa 2021 : ఏపీని వరణుడి వణికించాడు. వరద బీభత్సం సృష్టించాడు. వరణుడి ప్రకోపానికి రాష్ట్రం అల్లకల్లోలం అయింది. వర్షాలు తగ్గి మూడ్రోజులవుతున్నా.. ప్రజలు ఇంకా తేరుకోలేదు. ముఖ్యంగా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో వాన విలయం సృష్టించింది. ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. ఎందర్నో రోడ్డున పడేసింది. ఎంతో కష్టపడి కట్టుకున్న గూడును చెదరగొట్టింది. ఎంతోమందిని వారి కుటుంబాలకు దూరం చేసింది.

Kadapa Floods 2021 : కడప జిల్లా రాజంపేటలో వరద బీభత్సానికి 38 మంది గల్లంతయ్యారని మన్నూరు ఎస్సై భక్తవత్సలం తెలిపారు. వీరిలో ఇప్పటివరకు 25 మంది మృతదేహాలు లభించాయని వెల్లడించారు. గల్లంతైన మరో 13 మంది ఆచూకీ దొరకలేదని.. వారి కోసం తమ బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. 

AP floods 2021 : భారీ వర్షాలు, వరదల కారణంగా కడప జిల్లా రాజంపేట అతలాకుతలమయింది. వరద ఉద్ధృతికి జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. గుండ్లూరు, శేషమాంబాపురం, మందపల్లి గ్రామాలు నీటమునిగాయి. చెయ్యేరు నది నుంచి పెద్ద ఎత్తున నందలూరు, రాజంపేట తదితర ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. చెయ్యేరు పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి  :  

Crop damage in AP due to Rain 2021 : ఏపీలో వాయుగుండం దెబ్బకు పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వరద ధాటికి వంతెనలు కుప్పకూలాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. రైలు పట్టాలు తేలియాడాయి. వేల ఎకరాల్లో పంట నష్టం ఏర్పడింది. కట్టుబట్టలతో బాధితులు పునరావాస ప్రాంతాలకు తరలిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఏపీలో భారీ వర్షాలు ముంచెత్తాయి. ఫలితంగా నగరాల్లో పలు ప్రాంతాలు (AP Floods News 2021) సెలయేర్లుగా మారాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. చెరువుల్లో భారీగా నిర్మాణాలు చేయడంతో వర్షపు నీరంతా నగరాలను చుట్టేస్తోంది. కడప, తిరుపతి, నెల్లూరు నగరాల వరద కష్టాలకు కారణమిదేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Last Updated :Nov 25, 2021, 12:43 PM IST

ABOUT THE AUTHOR

...view details