తెలంగాణ

telangana

18 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం

By

Published : May 2, 2022, 7:49 PM IST

WhatsApp News: నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా మార్చి నెలలో 18 లక్షల భారతీయుల వాట్సాప్​ ఖాతాలను నిషేధించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ మేరకు నెలవారీ నివేదికను వెల్లడించింది.

WhatsApp bans 18 lakh Indian accounts in March
వాట్సాప్​

WhatsApp accounts ban: మార్చి నెలలో 18లక్షల భారతీయుల ఖాతాలను సామాజిక మాధ్యమం వాట్సాప్ నిషేధించింది. గ్రీవెన్స్ విభాగం ద్వారా వచ్చిన ఫిర్యాదులతో పాటుగా ఉల్లంఘనలను గుర్తించడానికి, నిరోధించడానికి ఏర్పాటు చేసుకున్న సొంత యంత్రాంగం ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 18.05 లక్షల ఖాతాలను నిషేధిస్తూ చర్యలు తీసుకుంది. ఈ మేరకు వాట్సాప్ నెలవారీ నివేదిక వెల్లడించింది.

WhatsApp latest news: ఫిబ్రవరిలోనూ 14.26 లక్షల భారతీయ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. ఖాతాదారుల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని వాట్సాప్ అధికార ప్రతినిధి తెలిపారు. కృత్రిమ మేధ సహా ఇతర సాంకేతికతలు, డేటా సైంటిస్టులు, నిపుణులపై పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. గతేడాది నుంచి కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి వచ్చాాయి. దీని ప్రకారం 50లక్షలకుపైగా వినియోగదారులు ఉన్న ప్రతి సంస్థ.. ప్రతినెల ఫిర్యాదుల నివేదికను వెల్లడించాలి. ఇందులో భాగంగానే వాట్సాప్ ప్రతినెలా చర్యలు తీసుకుంటోంది.

ఇదీ చదవండి:జీఎస్టీ ఆల్​టైమ్ రికార్డు.. ఏప్రిల్​లో రూ.1.68 లక్షల కోట్లు

ABOUT THE AUTHOR

...view details