తెలంగాణ

telangana

'బిట్‌కాయిన్లన్నీ అమ్మినా.. 25 డాలర్లు ఇవ్వను'

By

Published : May 3, 2022, 6:19 AM IST

Updated : May 3, 2022, 6:30 AM IST

Warren Buffett Bitcoin: క్రిప్టోలపై తన అనాసక్తిని మరోసారి వ్యక్తపరిచారు బిలియనీర్‌ వారెన్‌ బఫెట్‌. ప్రపంచంలో ఉన్న బిట్‌కాయిన్‌లన్నింటినీ తాను కనీసం 25 డాలర్లకు కూడా కొనబోనని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంతకీ ఆయన ఎందుకిలా అన్నారు?

warren buffett bitcoin
Warren Buffet

Warren Buffett Bitcoin: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలకు ఓవైపు ఆదరణ పెరుగుతోంది. మరోవైపు అదే స్థాయిలో దీనిపై విమర్శలూ వస్తున్నాయి. ఇప్పుడు అతిపెద్ద క్రిపోగా ఉన్న బిట్‌కాయిన్‌కు ఎంత ఆదరణ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం (సోమవారం సాయంత్రం 4:56 గంటలు) బిట్‌కాయిన్‌ విలువ 38,712.75 డాలర్ల వద్ద చలిస్తోంది. దీని మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 73.6 వేల కోట్ల డాలర్లుగా (సుమారు రూ.56.30 లక్షల కోట్లు) ఉంది.

తొలి నుంచి బిట్‌కాయిన్‌ సహా క్రిప్టోకరెన్సీపై పెదవి విరుస్తున్న వారిలో ప్రపంచ ప్రముఖ మదుపరి వారెన్‌ బఫెట్‌ ముఖ్యులు. తాజాగా మరోసారి బిట్‌కాయిన్‌పై ఉన్న ఆయన అనాసక్తిని వ్యక్తపరిచారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్న బిట్‌కాయిన్‌లన్నింటినీ తాను కనీసం 25 డాలర్లకు కూడా కొనబోనని స్పష్టం చేశారు. అంటే 73.6 వేల కోట్ల డాలర్లు విలువ చేసే బిట్‌కాయిన్‌ల కోసం ఆయన కనీసం 25 డాలర్లు కూడా వెచ్చించనని తెలిపారు. బిట్‌కాయిన్‌ల వల్ల ప్రయోజనమేమీ ఉండదని.. ఒకవేళ కొన్నా తిరిగి వాటిని ఎవరికో ఒకరికి అమ్మాల్సి ఉంటుందన్నారు.

అదే అమెరికాలో ఉన్న అన్ని అపార్ట్‌మెంట్లలో కేవలం 1 శాతాన్ని అమ్మినా తాను 25 బిలియన్‌ డాలర్లు పెట్టి కొనడానికి సిద్ధమని బఫెట్‌ అన్నారు. వాటి వల్ల అద్దె రూపంలో ఆదాయం వస్తుందని వివరించారు. అలాగే అదే మొత్తానికి దేశంలోని మొత్తం సాగుభూమిలో ఒకశాతాన్ని సొంతం చేసుకోడానికీ తాను ముందుకొస్తానన్నారు. వ్యవసాయ భూమి వల్ల ఆహార ఉత్పత్తులు వస్తాయన్నారు. కానీ, బిట్‌కాయిన్‌కు మాత్రం అలాంటి శక్తి లేదన్నారు. పరోక్షంగా దానికి ఎలాంటి అంతర్గత విలువ లేదని వివరించారు. భవిష్యత్తులో బిట్‌కాయిన్‌ ఎలాంటి రాబడినిస్తుందో తాను చెప్పలేనన్నారు. కానీ, దానికి ఎలాంటి ఉత్పత్తి విలువ మాత్రం ఉండదని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:స్టాక్‌ మార్కెట్‌లో బఫెట్‌, లించ్‌ పాటించే వ్యూహమిదే!

Last Updated :May 3, 2022, 6:30 AM IST

ABOUT THE AUTHOR

...view details