తెలంగాణ

telangana

ఉద్యోగులకు సంస్థ బంపర్ ఆఫర్.. బోనస్‌గా 4 సంవత్సరాల జీతం!

By

Published : Jan 10, 2023, 6:27 AM IST

తైవాన్‌కు చెందిన షిప్పింగ్ సంస్థ తన ఉద్యోగులకు అనూహ్యమైన ఆఫర్ ఇచ్చింది. భారీ స్థాయిలో బోనస్‌లు ఇస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

taiwan-evergreen-marine-corporation-4-years-salary-bonus-given-to-employees
ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పోరేషన్‌

తైవాన్‌కు చెందిన ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పోరేషన్‌ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారీ స్థాయిలో బోనస్​లు ప్రకటించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సంవత్సరాల జీతాన్ని బోనస్‌గా ఇస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థతో సంబంధం ఉన్నవర్గాలు వెల్లడించాయి.
తైవాన్‌కు చెందిన ఈ షిప్పింగ్ సంస్థ 50 నెలల జీతంతో సమానమైన బోనస్‌ను ఇస్తోంది. అంటే అది నాలుగు సంవత్సరాల జీతం కంటే ఎక్కువే. ఉద్యోగి జాబ్ గ్రేడ్‌, తైవాన్‌ ఆధారిత కాంట్రాక్టులు కలిగిన సిబ్బందికి మాత్రమే ఇది వర్తిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. ఒక ఏడాదిలో సంస్థ, ఉద్యోగి పనితీరు మీద ఆధారపడి సంవత్సరాంతపు బోనస్‌లు ఉంటాయని శుక్రవారం ఎవర్‌గ్రీన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే మిగతా వివరాలు ఏవీ వెల్లడించలేదు.

గత రెండు సంవత్సరాల్లో ఈ సంస్థ వ్యాపారం భారీస్థాయిలో పెరిగింది. 2022లో దీని ఆదాయం 20.7 బిలియన్ల డాలర్లకు పెరగనుందని అంచనా. 2020తో పోల్చుకుంటే అది మూడు రెట్లు అధికం. అయితే ఈ బోనస్‌ అదృష్టం ఉద్యోగులందరికీ దక్కడం లేదని తెలుస్తోంది. మరోవైపు గతేడాది ఈ సంస్థ పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. దీనికి చెందిన నౌక ఒకటి ఈజిప్ట్‌లోని సూయిజ్‌ కాలువలో అనూహ్యంగా ఇరుక్కుపోయింది. కీలకమైన, సన్నని కృత్రిమ కాలువలో కొద్దిరోజుల పాటు ఇతర నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ABOUT THE AUTHOR

...view details