తెలంగాణ

telangana

'జీఎస్‌టీ మండలి సిఫార్సులను కచ్చితంగా పాటించాలని లేదు.. కానీ'

By

Published : May 19, 2022, 6:44 PM IST

GST council recommendations: జీఎస్​టీ మండలి సిఫార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే, సహకార సమాఖ్య వ్యవస్థలో ఉన్నందున వాటికి విలువ ఇవ్వాలని సూచించింది.

supreme-court-order-gst-gst-council-recommendations
జీఎస్‌టీ మండలి సిఫార్సులపై సుప్రీం కీలక తీర్పు

GST council recommendations: జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) మండలి సిఫార్సులపై సుప్రీం కోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మండలి చేసే ప్రతిపాదనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే సహకార సమాఖ్య వ్యవస్థలో ఉన్నందున వాటికి విలువ ఇవ్వాలని సూచించింది. జీఎస్‌టీ చట్టాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన హక్కులు ఉన్నాయని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

సముద్రంలో సరకు రవాణాపై 5శాతం ఐజీఎస్‌టీ విధిస్తూ 2017లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను గుజరాత్‌ హైకోర్టు రద్దు చేసింది. ఓడలో సరకు రవాణాకు ఎలాంటి ఐజీఎస్‌టీ విధించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం.. జీఎస్‌టీ మండలి సిఫార్సులపై కీలక వ్యాఖ్యలు చేసింది.

" జీఎస్‌టీ కౌన్సిల్‌ చేసిన ప్రతిపాదనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఆర్టికల్‌ 246ఏ ప్రకారం.. పన్నులపై చట్టాలు చేసుకునే విషయంలో పార్లమెంట్‌, రాష్ట్రాల శాసనసభలకు సమాన హక్కులున్నాయి. జీఎస్‌టీపై కేంద్ర, రాష్ట్రాలు వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చు. అయితే మనం సహకార సమాఖ్య వ్యవస్థలో ఉన్నందున ఆర్టికల్‌ 279 ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రంగా వ్యవహరించకూడదు. జీఎస్‌టీ చట్టాల అమలు విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య విభేదాలు వస్తే.. జీఎస్‌టీ మండలి సరైన సలహాలు ఇవ్వాలి. ఆచరణీయ పరిష్కారం కోసం సామరస్యంగా పనిచేయాలి. ఒకరి అభిప్రాయాలను మరొకరిపై బలవంతంగా రుద్దకుండా చర్చించుకోవాలి. ఈ చర్చల ఆధారంగానే జీఎస్‌టీ ప్రతిపాదనలు చేయాలి"

ABOUT THE AUTHOR

...view details