తెలంగాణ

telangana

మార్కెట్లకు భారీ నష్టాలు.. సెన్సెక్స్ 1017 పాయింట్లు డౌన్.. రూపాయి @ ఆల్​టైం లో!

By

Published : Jun 10, 2022, 3:42 PM IST

Stock Markets: దేశీయ మార్కెట్లు ఈ వారాంతాన్ని భారీ నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలకు తోడు కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్​ 1000పైగా పాయింట్లు నష్టపోయింది. మరోవైపు.. రూపాయి మరింత దిగజారి జీవితకాల కనిష్ఠానికి చేరింది.

Stock market update
భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Stock Markets: దేశీయ మార్కెట్లపై బేర్​ పంజా విసిరింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, ద్రవ్యోల్బణం భయాలతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. బ్యాంకింగ్​, మెటల్​, ఐటీ వంటి కీలక రంగాల్లో అమ్మకాలతో దేశీయ సూచీలు ఈ వారాంతాన్ని భారీ నష్టాల్లో ముగించాయి. ఐపీఓకు వచ్చిన తొలి రోజు నుంచే ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ఎల్​ఐసీ.. మరింత పతనమైంది. సెన్సెక్స్​.. 1000 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 250కిపైగా పాయింట్ల నష్టంతో ముగిసింది.

ముంబయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 1017 పాయింట్ల నష్టంతో 54,303 వద్ద ముగిసింది

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 276 పాయింట్లు కోల్పోయి 16,202 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివి..
ఏషియన్​ పెయింట్స్​, గ్రాసిమ్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, దివిస్​ ల్యాబ్స్​, అపోలో హాస్పిటల్​ లాభాల్లో ముగిశాయి. మరోవైపు.. కొటక్​ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్​ ఫైనాన్స్​, హిందాల్కో, విప్రో 3 శాతానికిపైగా నష్టాలను మూటగట్టుకున్నాయి.

నష్టాల్లో అంతర్జాతీయ మార్కెట్లు: అమెరికా, ఐరోపా మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. ద్రవ్యోల్బణంపై అగ్రరాజ్యం నివేదిక వెలువడనుడటం వల్ల మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో డోజోన్స్​ 1.94శాత, ఎస్​అండ్​పీ సూచీ 2.38 శాతం మేర నష్టపోయాయి. నాస్​డాక్​ కూడా 2.75 శాతం నష్టాల్లోకి వెళ్లింది. ఇది దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్నే చూపింది.

జీవితకాల కనిష్ఠానికి రూపాయి విలువ..
రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. గురువారం ఇంట్రాడేలో 13 పైసలు బలహీన పడిన రూపాయి మారకం విలువ.. శుక్రవారం మరింత దిగజారి.. జీవితకాల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. శుక్రవారం ఆరంభ ట్రేడింగ్​లో అమెరికన్ డాలరుతో పోలిస్తే రుపాయి మారకం 8 పైసలు పడిపోయి 77.82 వద్ద ప్రారంభమైంది. అనంతరం మరింత బలహీనపడి ఓ దశలో 77.86 స్థాయికి పడిపోయింది. చివర్లో కాస్త కోలుకుని 77.83 వద్ద స్థిరపడింది.

ఇదీ చూడండి:వెంటాడుతున్న ద్రవ్యోల్బణం భయాలు.. మరి పెట్టుబడుల సంగతేంటి?

తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details