తెలంగాణ

telangana

మళ్లీ పెరిగిన చమురు ధరలు.. వారం రోజుల్లో ఆరో సారి

By

Published : Mar 28, 2022, 7:36 AM IST

Petrol Diesel Prices: పెట్రోల్​ ధరలు సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. వారం రోజుల్లో ఆరోసారి ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దిల్లీ, హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ఎంతంటే..?

Petrol Diesel prices increased for sixth time in 7 days
మళ్లీ పెరిగిన చమురు ధరలు.. వారం రోజుల్లో ఆరో సారి

Petrol Price Hike: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు కొనసాగుతోంది. లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర 99 రూపాయల 41 పైసలకు చేరింది. డీజిల్‌ ధర 90 రూపాయల 77 పైసలకు పెరిగింది. వారం రోజుల వ్యవధిలో లీటర్‌ పెట్రోల్‌ 4 రూపాయలు. డిజీల్‌ పై 4రూపాయల 10పైసలు పెరిగింది. ధరలు ఆరు సార్లు పెరగడం గమనార్హం. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.112.71, డీజిల్ రూ.99.08గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details