తెలంగాణ

telangana

దసరా రోజే జియో 5జీ ట్రయల్​.. ముందుగా ఈ నాలుగు నగరాల్లోనే..

By

Published : Oct 4, 2022, 7:13 PM IST

Updated : Oct 4, 2022, 7:42 PM IST

JIO 5G Services : జియో.. బుధవారం నుంచి నాలుగు నగరాల్లో 5జీ సర్వీసుల ట్రయల్​ను నిర్వహించనుంది. నాలుగు నగరాల్లో ఈ బీటా ట్రయల్ నిర్వహించనున్నట్లు జియో ప్రకటించింది.

Jio 5G services
జియో 5జీ

JIO 5G Services : దసరా సందర్భంగా రిలయన్స్‌ జియో బుధవారం నుంచి నాలుగు నగరాల్లో 5జీ సర్వీసుల బీటా ట్రయల్‌ను నిర్వహించనుంది. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, వారణాసిలో ఈ బీటా ట్రయల్‌ను నిర్వహించనున్నారు. ఇందుకోసం కొంత మంది వినియోగదారులను జియో ఎంపిక చేసుకోనుంది. జియో ట్రూ 5జీ వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద వారికి ఆహ్వానాలను పంపనుంది. సెకనుకు ఒక గిగాబైట్‌ వేగంతో ఎంపిక చేసిన వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా లభించనుంది. ఈ మేరకు రిలయన్స్‌ జియో ఒక ప్రకటన విడుదల చేసింది.

5జీ సేవలు తొలుత ఎంపిక చేసిన 13 నగరాల్లో ప్రారంభమై, వచ్చే కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. తొలి దశలో భాగంగా అహ్మదాబాద్‌, బెంగళూరు, చండీగఢ్‌, చెన్నై, దిల్లీ, గాంధీనగర్‌, గురుగ్రామ్‌, హైదరాబాద్‌, జామ్‌నగర్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, పుణె నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇందులో నాలుగు నగరాల్లో టెలికాం సంస్థలు నేటి నుంచే 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

భారత్‌పై 5జీ మొత్తం ఆర్థిక ప్రభావం 2035 నాటికి 450 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.36 లక్షల కోట్ల)కు చేరొచ్చని అంచనా. ప్రస్తుత 4జీతో పోలిస్తే 7-10 రెట్ల డేటా వేగం 5జీ సేవల్లో లభిస్తుందని, కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలు సాధ్యపడతాయని చెబుతున్నారు. దేశంలోని మూడు ప్రైవేటు టెలికాం సంస్థలు 5జీ సేవల కోసం రూ.1.5 లక్షల కోట్ల స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. జియో రూ.88,078 కోట్లు, ఎయిర్‌టెల్‌ రూ.43,084 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. అక్టోబరులోనే 5జీ సేవలు తీసుకొస్తామని ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్‌ సంస్థలు ప్రకటించాయి.

ఇవీ చదవండి:కియా​ ఓనర్స్​కు అలర్ట్.. 44వేల కార్లు రీకాల్.. ఆ సమస్యే కారణం!

స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు.. 58వేల ఎగువకు సెన్సెక్స్.. పుంజుకున్న రూపాయి

Last Updated : Oct 4, 2022, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details