తెలంగాణ

telangana

Gold Rate Today : బంగారం ధరకు రెక్కలు.. మళ్లీ ఆల్​టైమ్​ హై.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

By

Published : May 5, 2023, 11:32 AM IST

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold And Silver Rates In AP And Telangana
భారీగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.1600 పెరిగి.. ప్రస్తుతం రూ.63,620కి చేరుకుంది. మరోవైపు, కిలో వెండి ధర రూ.2,770పెరిగి.. ప్రస్తుతం రూ.79,470 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • Gold price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.63,620 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.79,470 రూపాయలుగా ఉంది.
  • Gold price in Vijayawada : విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.63,620గా ఉంది. కిలో వెండి ధర రూ.79,470 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vishakhapatnam : వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.63,620 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.79,470గా ఉంది.
  • Gold price in Proddatur : ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.63,620గా ఉంది. కేజీ వెండి ధర రూ.79,470 వద్ద ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 2,048 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 26.00 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.23,84,647 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్​ కాయిన్​, క్రిప్టోకరెన్సీలతో.. పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.23,84,647
ఇథీరియం రూ.1,54,855
టెథర్​ రూ.81.70
బైనాన్స్​ కాయిన్​ రూ.26,572
యూఎస్​డీ కాయిన్ రూ.81.66

నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు..
అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాల కారణంగా.. దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభయయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజ్‌​ (బీఎస్​ఈ) సెన్సెక్స్​ 500 పాయింట్లు నష్టపోయి 61,250 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ.. 135 పాయింట్లు తగ్గి 18,120 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్​ 30 సూచీలో టైటాన్​, ఐసీఐసీఐ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్, ఎల్ ఆండ్ టీ, మారుతీ, కోటక్ బ్యాంక్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్, ఐటీసీ, టాటా మోటార్స్​, పవర్​ గ్రిడ్​, హిందుస్థాన్ యునీలివల్​, నెస్లే ఇండియా స్టాక్స్​ లాభాల్లో ఉన్నాయి. సన్ ఫార్మా, రిలయన్స్​, టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఎన్టీపీసీ, విప్రో, టెక్​ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details