తెలంగాణ

telangana

స్వల్పంగా పెరిగిన బంగారం రేటు.. క్రిప్టో కరెన్సీ ధరలు ఇలా..

By

Published : Apr 14, 2022, 10:30 AM IST

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధర స్వల్పంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. రూ.170 మేర వృద్ధి చెందింది. మరోవైపు, అంతర్జాతీయంగా క్రిప్టోకరెన్సీ ధరలు ఫ్లాట్​గా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు, రూపాయి మారకం వంటి వివరాలు ఇలా ఉన్నాయి..

gold and crypto
gold and crypto

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.170 ప్రియమైంది. కేజీ వెండి కూడా స్వల్పంగానే పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.54,810 గా ఉంది. కిలో వెండి ధర రూ.71,480 వద్ద కొనసాగుతోంది.

• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.54,810 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,480గా ఉంది.

• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,810 గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,480 వద్ద కొనసాగుతోంది.

• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.54,810 గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,480 వద్ద కొనసాగుతోంది.

  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఔన్సు బంగారం 5 డాలర్లు అధికంగా ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,976 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.81 డాలర్లుగా ఉంది.

• అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 104.69 డాలర్లుగా ఉంది.

• రూపాయి మారకం విలువ 6 పైసలు పడిపోయింది. ప్రస్తుతం డాలరుకు మారకం విలువ రూ.76.21గా ఉంది.

ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు పేట్రో బాదుడుకు కాస్త విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. గురువారం నుంచి చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది.

• ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది.

• వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది.

• హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

Cryptocurrency rates: క్రిప్టోకరెన్సీ ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రధాన క్రిప్టో కరెన్సీ వివరాలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర(రూ.ల్లో)
బిట్​కాయిన్ 32,76,594
ఇథీరియం 2,47,410
డోజ్​కాయిన్ 11.23
టెథర్ 79.47
బీఎన్​బీ కాయిన్ 33,545

ఇదీ చదవండి:Infosys q4 Results: 'కొత్తగా 50 వేల ఉద్యోగాలు.. రష్యాతో డీల్స్​కు నో'

ABOUT THE AUTHOR

...view details