తెలంగాణ

telangana

'అలా అయితే పెరుగు, పప్పు, బియ్యంపై నో జీఎస్​టీ'.. నిర్మల​ క్లారిటీ

By

Published : Jul 19, 2022, 4:06 PM IST

సోమవారం అమలులోకి వచ్చిన కొత్త జీఎస్​టీ నిబంధనలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ మరింత స్పష్టత ఇచ్చారు. పెరుగు సహా 11 రకాల వస్తువుల జాబితాను పేర్కొంటూ.. అవి విడిగా అమ్మితే వాటిపై జీఎస్​టీ వర్తించదని తేల్చిచెప్పారు.

gst
జీఎస్​టీ

పెరుగు, లస్సీ సహా పలు రకాల వస్తువులపై జీఎస్​టీ విధించిన కేంద్రం.. సోమవారం కొత్త విధానం అమలులోకి తెచ్చింది. పలు రకాల వస్తువులు, సేవలపై జీఎస్​టీ విధించడం సహా ఇప్పటికే అమలులో ఉన్న వాటిపై రేట్లను పెంచుతూ గతనెల జీఎస్​టీ మండలి నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై స్వల్ప గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్​ క్లారిటీ ఇచ్చారు. పప్పులు, పెరుగు, ఓట్స్​ సహా మొత్తం 11 రకాల నిత్యావసర సరకులను ముందస్తుగా ప్యాక్​ లేదా లేబెల్డ్​ చేసి విక్రయిస్తేనే జీఎస్​టీ వర్తిస్తుందని తెలిపారు. లూజ్​​గా వాటిని అమ్మితే ఈ జీఎస్​టీ వర్తించదని స్పష్టం చేశారు.

నిర్మలా సీతారామన్​ పేర్కొన్న నిత్యావసర వస్తువులు

పప్పులు, ఆవాలు, ఓట్స్​, గోధుమ, మొక్కజొన్న, బియ్యం, గోధుమపిండి, రవ్వ, మరమరాలు, శెనగ పిండి, పెరుగు లేదా లస్సీని ఈ జాబితాలో పేర్కొన్నారు నిర్మలా సీతారామన్. ఎల్‌ఈడీ లైట్లు, కత్తులు, కటింగ్‌ బ్లేడ్లు, పేపర్‌ కత్తులు, పెన్సిల్‌ చెక్కుకునే షార్ప్‌నర్‌, చెంచాలు, గరిటెలు, ఫోర్క్‌లు, స్కిమ్మర్‌, కేక్‌ సర్వర్లు, ప్రింటింగ్‌, డ్రాయింగ్‌, రైటింగ్‌ ఇంక్‌, ఫిక్సర్‌, వాటికి వినియోగించే మెటల్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌బోర్డు సహా పలు వస్తువులపై 18 శాతానికి జీఎస్​టీని పెంచారు.

ఇదీ చూడండి :'80'ని తాకిన రూపాయి.. 2014 తర్వాత 25% పతనం.. వారి కంటే బెటరే అన్న నిర్మల

ABOUT THE AUTHOR

...view details