తెలంగాణ

telangana

రూ.5 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? టాప్​-8 మోడల్స్ ఇవే!

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 3:41 PM IST

Best Cars Under 5 Lakhs In India In Telugu : మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ కేవలం రూ.5 లక్షలు మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం ఇండియాలో రూ.5 లక్షల బడ్జెట్లో మంచి బ్రాండెడ్​ కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలోని మోస్ట్ పాప్యులర్​ బ్రాండెడ్​ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

popular Cars Under 5 Lakhs in India
best Cars Under 5 Lakhs in India

Best Cars Under 5 Lakhs In India : భారతదేశంలో నేడు కార్ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, తమ కుటుంబ అవసరాల కోసం, రోజువారీ పనుల కోసం తక్కువ బడ్జెట్లోని మంచి బ్రాండెడ్ కార్లు కొనడానికి ఇష్టపడుతున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ సింపుల్​ బడ్జెట్లో మంచి కార్లను రూపొందిస్తున్నాయి. వాటిలో రూ.5 లక్షల బడ్జెట్లోని బెస్ట్ కార్లపై ఓ లుక్కేద్దాం రండి.

1. Maruti Alto K10 Features : ఈ మారుతి ఆల్టో కె10 అనేది బెస్ట్ బడ్జెట్​ ఫ్రెండ్లీ కారు. దీనిలో 1.0 లీటర్​ పెట్రోల్ ఇంజిన్​ అమర్చారు. ఇది 65.7 bhp పవర్​, 89 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీనిలో డీజిల్ ఇంజిన్ వేరియంట్ కూడా ఉంటుంది. ఈ కారు మైలేజ్ ఆయా వేరియంట్లను అనుసరించి 24.39 kmpl - 33.85 km/kg ఉంటుంది. హెవీ ట్రాఫిక్​లోనూ చాలా ఈజీగా ఈ హ్యాచ్​బ్యాక్​ కారును డ్రైవ్ చేయవచ్చు.

మారుతి ఆల్టో కె10

Maruti Alto K10 Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి ఆల్టో కె10 కారు ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

మారుతి ఆల్టో కె10

2. Maruti Alto Features : ఈ మారుతి ఆల్టో కారులో 796 సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్​ను అమర్చారు. దీనితో పాటు సీఎన్​జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ కారు మైలేజ్​ ఆయా వేరియంట్లను అనుసరించి 22.05kmpl - 31.59 km/kg వరకు ఉంటుంది. ఈ కారు 5 వేరియంట్లలో, 4 కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది.

మారుతి ఆల్టో

Maruti Alto Price : మార్కెట్లో ఈ మారుతి ఆల్టో కారు ధర రూ.3.54 లక్షల నుంచి రూ.5.13 లక్షల ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

మారుతి ఆల్టో

3. Renault Kwid Features : ఈ రెనో క్విడ్ హ్యాచ్​బ్యాక్​లో 1 లీటర్​ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్​ను అమర్చారు. దీని మైలేజ్​ 21.46 kmpl - 22.3 kmpl ఉంటుంది. ఈ కారు 11 వేరియంట్లలో, 7 రంగుల్లో లభిస్తుంది. ఇది మారుతి ఆల్టో కె10, మారుతి సెలెరియో, మారుతి స్విఫ్ట్​లతో నేరుగా పోటీపడుతుంది.

రెనో క్విడ్​

Renault Kwid Price: మార్కెట్లో ఈ మారుతి రెనో కారు ధర రూ.4.69 లక్షల నుంచి రూ.6.44 లక్షల రేంజ్​లో ఉంటుంది.

రెనో క్విడ్​

4. Maruti S Press Features : ఈ మారుతి ఎస్​-ప్రెస్సో కారు 1 లీటర్​ పెట్రోల్ ఇంజిన్​, సీఎన్​జీ ఆప్షన్లతో వస్తుంది. పెట్రోల్ వేరియంట్​ మైలేజీ 24.02 kmpl , సీఎన్​జీ వేరియంట్ మైలేజీ 32.73 km/kg. ఈ మారుతి ఎస్​-ప్రెస్సో కారు 8 వేరియంట్లలో, 7 అందమైన రంగుల్లో లభిస్తుంది.

మారుతి ఎస్-ప్రెస్సో

Maruti S Press Price : మార్కెట్లో ఈ మారుతి ఎస్​-ప్రెస్సో కారు ధర రూ.4.26 లక్షల నుంచి రూ.6.11 లక్షల వరకు ఉంటుంది.

మారుతి ఎస్-ప్రెస్సో

5. Bajaj Qute Features : ఈ బజాజ్ క్యూట్​లో 216 సీసీ సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఈ సీఎన్​జీ హ్యాచ్​బ్యాక్​ 5500 rpm వద్ద 10.8 bhp పవర్ జనరేట్ చేస్తుంది. దీని బూట్​ స్పేస్​ 20 లీటర్స్. ఈ బజాజ్ క్యూట్​ సింగిల్​ వేరియంట్​లో, 3 కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది.

బజాజ్ క్యూట్​

Bajaj Qute Price : మార్కెట్​లో బజాజ్ క్యూట్​ ధర సుమారుగా 3.60 లక్షలు ఉంటుంది.

బజాజ్ క్యూట్​

6. PMV EaS E Features : ఈ ఎలక్ట్రిక్​ 2 సీటర్​ హ్యాచ్​బ్యాక్​ కారులో 10 కిలోవాట్ సామర్థ్యంగల బ్యాటరీ ఉంటుంది. దీనిని ఫుల్​ ఛార్జ్ చేస్తే, 160 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారులోని ఇంజిన్ 13.41 bhp పవర్​, 50 Nm టార్క్ జనరేట్​ చేస్తుంది. ఇది సింగిల్ వేరియంట్​లో, 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

పీఎంవీ EaS E

PMV EaS E Price : ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ.4.9 లక్షలు ఉంటుంది.

పీఎంవీ EaS E

7. Strom Motors R3 Features : ఈ స్ట్రోమ్ మోటార్స్​ ఆర్​3 అనేది 2 సీటర్ ఎలక్ట్రిక్ కారు. దీనిని ఫుల్ ఛార్జ్​ చేస్తే, 200 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చు. దీనిలోని ఇంజిన్​ 20.11 bhp పవర్, 90 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని బూట్ స్పేస్ 300 లీటర్లు. కనుక హెవీ లగేజ్​ను కూడా చాలా ఈజీగా తీసుకెళ్లవచ్చు. ఇది సింగిల్ వేరియంట్​లో, 4 అందమైన రంగుల్లో లభిస్తుంది.

స్ట్రోమ్ మోటార్స్ ఆర్​3

Strom Motors R3 Price : ఈ స్ట్రోమ్ మోటార్స్ ఆర్​3 కారు ధర సుమారుగా రూ.4.50 లక్షలు ఉంటుంది.

స్ట్రోమ్ మోటార్స్ ఆర్​3
స్ట్రోమ్ మోటార్స్ ఆర్​3

8. Maruti Alto 800 Tour Features : మారుతి ఆల్టో 800 టూర్ అనేది 5 సీటర్​ కారు. దీనిలో​ 796 సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్​ను అమర్చారు. దీని మైలేజ్​ 22.05 kmpl. ఇది సింగిల్ వేరియంట్​లో, మూడు రంగుల్లో లభిస్తుంది.

మారుతి ఆల్టో 800 టూర్​

Maruti Alto 800 Tour Price : ఈ మారుతి ఆల్టో 800 టూర్ కారు ధర సుమారుగా రూ.4.20 లక్షలు ఉంటుంది.

మారుతి ఆల్టో 800 టూర్​

18 నుంచి గోల్డ్‌ బాండ్‌ సబ్‌స్క్రిప్షన్‌ - వారికి ప్రత్యేక డిస్కౌంట్ -​ ఎలా అప్లై చేయాలంటే?

తరచూ ప్రయాణాలు చేస్తుంటారా? ట్రావెల్ ఇన్సూరెన్స్​ తప్పనిసరి - ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details