తెలంగాణ

telangana

ఈ అక్షయ తృతీయకు బంగారం అమ్మకాలు డల్​.. ఇదే కారణం!

By

Published : Apr 20, 2023, 5:35 PM IST

దేశంలో బంగారం ధర రూ.60 వేలు దాటిపోవడం వల్ల ఈ ఏడాది అక్షయ తృతీయకు పసిడి అమ్మకాలు 20 శాతం మేర తగ్గవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ధర తగ్గితే మాత్రం మళ్లీ బంగారం అమ్మకాలు పుంజుకుంటాయని పేర్కొన్నాయి.

gold rate today
gold rate today

దేశంలో బంగారానికి ఉండే క్రేజే వేరు. పేదల నుంచి ధనవంతుల వరకు అందరూ బంగారాన్ని కొనుగోలు చేసేందుకు తహతహలాడుతుంటారు. సాధారణంగా అక్షయ తృతీయ, ధన త్రయోదశి, వరలక్ష్మీ వ్రతం.. అలాగే ఉగాది వంటి పండగ సమయాల్లో వినియోగదారులతో బంగారం దుకాణాలు కళకళలాడుతాయి. అయితే ఇటీవల పుత్తడి ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల పసిడి ధర రూ. 60 వేలు దాటేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్​ 22న ( శనివారం) అక్షయ తృతీయ సందర్భంగా బంగారం అమ్మకాలు 20 శాతం మేర తగ్గవచ్చని అంచనా వేస్తున్నాయి మార్కెట్ వర్గాలు.

"ఇటీవల కాలంలో 10 గ్రాముల బంగారం ధర రూ.60 వేలు దాటింది. అక్షత తృతీయ సందర్భంగా ప్రతి ఏడాది భారీగా బంగారు ఆభరణాలు అమ్ముడవుతాయి. అయితే ఈ ఏడాది పసిడి ధర పతాక స్థాయికి చేరడం వల్ల వినియోగదారులు పసిడి కొనుగోలుకు మొగ్గు చూపే అవకాశం తక్కువే. దాదాపు 20 శాతం మేర బంగారం అమ్మకాలు తగ్గవచ్చు. సాధారణంగా అక్షయ తృతీయ సందర్భంగా దక్షిణాదిలో 40 శాతం, పశ్చిమ రాష్ట్రాల్లో 25 శాతం, తూర్పు రాష్ట్రాల్లో 15 శాతం, ఉత్తరాదిలో 15 శాతం వ్యాపారం జరుగుతుంది."

--సయామ్ మెహ్రా, ఆల్​ ఇండియా జెమ్​ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్​

బంగారం ధర పెరగుదల వల్ల అక్షయ తృతీయ సమయంలో పసిడి అమ్మకాలపై ప్రభావం పడుతుందని ఎన్​ఓసీ జ్యువెల్లర్ ఎండీ అనంత పద్మనాభన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పసిడి అమ్మకాలు 20 శాతం మేర తగ్గవచ్చని ఆయన అంచనా వేశారు. అయితే.. బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గితే మళ్లీ అమ్మకాలు పుంజుకుంటాయని పద్మనాభన్ అన్నారు.

బంగారం ధర ఇలా.. దేశ రాజధాని దిల్లీలో గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగి.. ప్రస్తుతం రూ. 60,340కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.850 పెరిగి.. రూ.75,450 వద్ద స్థిరపడింది.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.62,450 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.77,350 రూపాయలుగా ఉంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.62,450 గా ఉంది. కిలో వెండి ధర రూ.77,350 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,450 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.77,350 గా ఉంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.62,450గా ఉంది. కేజీ వెండి ధర రూ.77,350 వద్ద ఉంది.

ABOUT THE AUTHOR

...view details