తెలంగాణ

telangana

7th Pay Commission News : రైల్వే ఉద్యోగులకు పండగ.. భారీగా బోనస్ ప్రకటించిన కేంద్రం!

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 3:38 PM IST

7th Pay Commission News : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో రైల్వే ఉద్యోగులకూ భారీగా ఆఫర్ ప్రకటించింది. పండగ ముందు వారికి బోనస్‌ ఇస్తున్నట్టు అనౌన్స్ చేసింది.

7th Pay Commission News
7th Pay Commission News

7th Pay Commission DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు మోదీ ప్రభుత్వం దసరా పండుగకు శుభవార్తచెప్పింది. ప్రధాని మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు 4 శాతం కరవుభత్యం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఇకపై ఉద్యోగులకు 42 శాతం ఉన్న డీఏకు బదులు 46 శాతం డియర్‌నెస్‌ అలవెన్స్‌ లభిస్తుంది.

7th Pay Commission DA Hike for Employees :ఈ నిర్ణయం వల్ల 48.67 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం లభించనుంది. పింఛన్‌దారులకు ఇచ్చే కరవు భృతి (డీఆర్‌)ని కూడా ఇదే స్థాయిలో 4 శాతం పెంచారు. దీని వల్ల 67.95 లక్షల మందికి లబ్ధి కలగనుంది. పెరిగిన డీఏ, డీఆర్‌లు ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. డీఏ, డీఆర్‌ పెంపు వల్ల ఖజానాపై ఏటా రూ.12,857 కోట్ల అదనపు భారం పడనుందని కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్ చెప్పారు.

Railway Employee Bonus 2023 :మరోవైపు కేంద్ర ప్రభుత్వం దసరా, దీపావళి సందర్భంగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన 'ఉత్పాదకతతో ముడిపడిన బోనస్‌' (పీఎల్‌బీ) డబ్బులను బోనస్‌గా చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ఇది 11.07 లక్షల మందికి అందుతుందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ చెప్పారు. ట్రాక్‌ మెయింటెనర్లు, లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్‌మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, సాంకేతిక సహాయకులు, పాయింట్స్‌మెన్, మినిస్టీరియల్‌, సిబ్బంది, ఇతర గ్రూప్‌-సి ఉద్యోగులకు బోనస్‌ లభిస్తుందని తెలిపారు.

2022-23 ఆర్థిక సంవత్సరంలో పనితీరుకు గానూ చెల్లిస్తున్న ఈ బోనస్‌ వల్ల ఖాజానాపై రూ.1,968.87 కోట్ల భారం పడుతుందన్నారు. 2022-2023 సంవత్సరంలో రైల్వే పనితీరు చాలా బాగుందని అనురాగ్‌ ఠాకుర్ చెప్పారు. ఈ సారి రైల్వే రికార్డు స్థాయిలో 1,509 మిలియన్ టన్నుల కార్గోను రవాణా చేసిందని, దాదాపు 6.5 బిలియన్ (650 కోట్లు) ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేర్చిందని ఆయన తెలిపారు.

7th Pay Commission :సాధారణంగా ఏటా రెండు సార్లుడియర్‌నెస్‌ అలవెన్స్‌ను (DA), డియర్‌నెస్ రిలీఫ్‌(DR)ను కేంద్రం పెంచుతుంది. ఈ పెంపు జనవరి, జూలై నెలలో ఉంటుంది. ఈ ఏడాదిలో పెంపు కాస్త ఆలస్యమైంది. అయినా ఉద్యోగులను నిరాశ పరచకుండా డీఏ, డీఆర్‌ను 4 శాతం కేంద్ర ప్రభుత్వం పెంచింది.

డీఏ ఎలా లెక్కిస్తారు?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెనస్స్‌ (DA)ను ఉద్యోగి బేసిక్‌ సాలరీలో ఒక శాతంగా లెక్కిస్తారు. డీఏను లెక్క చేయడానికి గత 12 నెలలకు సంబంధించిన ఆల్‌-ఇండియా కన్‌స్యూమర్ ప్రైస్‌ ఇండెక్స్‌ (AICPI) ప్రకటించిన లెక్కలను పరిగణనలోకి తీసుకుంటారు.

7th Pay Commission DA Hike : ఉద్యోగులకు డీఏ పెంపుతో.. వేతనం ఎంత పెరుగుతోంది..?

DA Hike News : ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ 4 శాతం పెంపు.. రైల్వే ఎంప్లాయిస్​కు 78 రోజుల బోనస్​

ABOUT THE AUTHOR

...view details