తెలంగాణ

telangana

లాభాల్లో మార్కెట్లు- 40 వేల మార్క్ చేరువలో సెన్సెక్స్

By

Published : Oct 16, 2020, 3:55 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు గడించాయి. సెన్సెక్స్ 255 పాయింట్లు లాభపడి.. 39,983పాయింట్ల వద్ద స్థిరపడింది. 82 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ.. 11,762 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఆటో, ఫార్మా రంగ షేర్లు రాణించాయి.

stock market close
స్టాక్ మార్కెట్లు క్లోసింగ్

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ పవనాలు ఉన్నప్పటికీ దేశీయ సూచీలు లాభాల్లో పయనించాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు మార్కెట్లలో జోరు నింపాయి. ఆటో, ఫార్మా రంగ కంపెనీల షేర్లు సైతం లాభాలు గడించాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 255 పాయింట్లు లాభపడింది. చివరకు 39,983 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది.

అటు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం లాభాలు నమోదు చేసింది. 82 పాయింట్లు వృద్ధి చెంది... 11,762 పద్ద స్థిర పడింది.

లాభ-నష్టాలు

సెన్సెక్స్ షేర్లలో టాటా స్టీల్ షేరు అత్యధికంగా లాభపడింది. 5 శాతానికి పైగా వృద్ధి చెందింది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ బ్యాంక్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్ షేర్ల విలువ 2 శాతానికి పైగా పెరిగింది.

హెచ్​సీఎల్ టెక్, మహీంద్ర అండ్ మహీంద్ర, రిలయన్స్, ఏషియన్ పేంట్స్ షేర్లు నష్టపోయాయి.

రూపాయి

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం కాస్త బలపడింది. ఒక పైసా పెరిగి 73.35కి చేరింది.

ABOUT THE AUTHOR

...view details