తెలంగాణ

telangana

వ్యాక్సిన్ వార్తలు, కంపెనీల ఫలితాలే కీలకం!

By

Published : May 16, 2021, 4:10 PM IST

స్టాక్ మార్కెట్లకు ఈ వారం కరోనా కేసులు, వ్యాక్సినేషన్ వార్తలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు దిశా నిర్దేశం చేయనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల కదలికలపైనా మదుపరులు దృష్టి సారించే వీలుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Stocks Expectations
స్టాక్ మార్కెట్ అంచనాలు

కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు, దేశంలో వ్యాక్సినేషన్​ సంబంధిత వార్తలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్లను ముందుకు నడిపించనున్నాయి.

ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేసేందుకు కీలకమైన అంశాలు పెద్దగా లేనందున మదుపరులు అంతర్జాతీయ సూచీల కదలికలు, అమెరికా బాండ్ల మార్కెట్, ముడి చమురు ధరలు, రూపాయి విలువ హెచ్చుతగ్గులపైన ఎక్కువగా దృష్టి సారించే వీలుందని విశ్లేషకులు చెబుతున్నారు.

'దేశంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్ అప్​డేట్స్ ఈ వారం స్టాక్ మార్కెట్లను కీలకంగా ప్రభావితం చేసే అవకాశం ఉంద'ని రెలిగేర్​ బ్రోకింగ్ పరిశోధనా విభాగం ఉపాధ్యక్షుడు అజిత్​ మిశ్రా పేర్కొన్నారు.

భారతీ ఎయిర్​టెల్, టాటా మోటార్స్, ఇండియన్ ఆయిల్​ కార్పొరేషన్​, ఎస్​బీఐ సహా పలు దిగ్గజ సంస్థలు ఈ వారం 2020-21 క్యూ4, వార్షిక ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ ఫలితాల ప్రభావం ఆయా కంపెనీల షేర్లపై కీలకంగా పడనుంది.

వీటన్నింటితో పాటు సోమవారం విడుదలవనున్న టోకు ద్రవ్యోల్బోణం గణాంకాలు మార్కెట్లను కీలకంగా ప్రభావితం చేయొచ్చని విశ్లేషకులు వివరించారు.

ఇదీ చదవండి:ఎయిర్​టెల్ కొత్త ఆఫర్​- రూ.49 రీఛార్జ్ ఫ్రీ!

ABOUT THE AUTHOR

...view details