తెలంగాణ

telangana

మార్కెట్ల రికార్డు- జీవిత కాల గరిష్ఠస్థాయిలో సూచీలు

By

Published : Nov 24, 2020, 3:48 PM IST

ట్రేడింగ్​లో స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం జీవితకాల గరిష్ఠ స్థాయిలకు చేరాయి. 446 పాయింట్ల లాభంతో 44,523 వద్ద సెన్సెక్స్ స్థిరపడింది. 129 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ.. 13 వేల మార్క్ పైన ట్రేడింగ్ ముగించింది.

stock markets news
సెన్సెక్స్ నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుస లాభాలను నమోదు చేశాయి. మంగళవారం ట్రేడింగ్​లో జీవితకాల గరిష్ఠాలను తాకాయి.

446 పాయింట్లు పైకెగసిన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. సరికొత్త శిఖరాలను చేరింది. 44,523 పాయింట్ల వద్ద ముగిసింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం లాభాల బాటలోనే పయనించింది. 129 పాయింట్లు వృద్ధి చెంది.. 13,055 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివివే..

సెన్సెక్స్​లోని షేర్లలో యాక్సిస్ బ్యాంక్, మహీంద్ర అండ్ మహీంద్ర, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐటీసీ, మారుతీ, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో పయనించాయి.

హెచ్​డీఎఫ్​సీ, టైటాన్, ఓఎన్​జీసీ, భారతీ ఎయిర్​టెల్, నెస్లే షేర్లు నష్టాలపాలయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details