తెలంగాణ

telangana

భారీ లాభాల్లో మార్కెట్లు- 42వేల ఎగువకు సెన్సెక్స్

By

Published : Nov 9, 2020, 9:41 AM IST

Updated : Nov 9, 2020, 10:40 AM IST

markets live updates
దేశీయ స్టాక్​ మార్కెట్లు

10:38 November 09

అంతర్జాతీయ సానుకూల పవనాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 533 పాయింట్ల బలపడి 42,426 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 160 పాయింట్లు పెరిగి 12,423 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

ఒకానొక దశలో 650 పాయింట్లు పైకెగిసిన సెన్సెక్స్..  ప్రారంభ సెషన్​లో రికార్డు లాభాలను నమోదు చేసింది.  

భారీగా విదేశీ నిధుల ప్రవాహం మార్కెట్లను పరుగులు పెట్టించాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయంతో ఆసియా మార్కెట్లు పుంజుకోవటం దేశీయ సూచీలకు కలిసివచ్చింది.  

లాభనష్టాల్లో..

ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​సీఎల్ టెక్, యాక్సిస్​ బ్యాంక్, ఇన్ఫోసిస్, పవర్​గ్రిడ్​ షేర్లు 3 శాతం మేర లాభాల్లో ఉన్నాయి.  

ఐటీసీ, టీసీఎస్, మారుతి, ఎస్​బీఐ స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి.  

చమురు..  

అంతర్జాతీయ మార్కెట్​లో చమురు ధర 2.66 శాతం పెరిగి బ్యారెల్​కు 40.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది.  

09:34 November 09

బైడెన్ విజయంతో పుంజుకున్న మార్కెట్లు

దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 534 పాయింట్ల బలపడి 42,447 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 186 పాయింట్లు పెరిగి 12,450 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయంతో ఆసియా మార్కెట్లు పుంజుకోవటం దేశీయ సూచీలకు కలిసివచ్చింది.  

అన్ని షేర్లు లాభాల్లోనే..

ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​సీఎల్ టెక్, యాక్సిస్​ బ్యాంక్, ఇన్ఫోసిస్, పవర్​గ్రిడ్​ షేర్లు 2 శాతం మేర లాభాల్లో ఉన్నాయి.  

ఆసియాలోని ప్రధాన మార్కెట్లైన జపాన్, షాంఘై, హాంకాంగ్, దక్షిణ కొరియా సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.  

Last Updated :Nov 9, 2020, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details