తెలంగాణ

telangana

మార్కెట్లకు భారీ లాభాలు- 52 వేల వద్ద సెన్సెక్స్​!

By

Published : May 31, 2021, 3:40 PM IST

Updated : May 31, 2021, 3:58 PM IST

స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్​ను భారీ లాభాలతో ముగించాయి. సెన్సెక్స్​ 514 పాయింట్లు పెరిగి 51,937 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 147 పాయింట్లు పుంజుకుని 15,582 కు చేరుకుంది. ఆర్థిక షేర్లు రాణించాయి.

Indices, bse, nse
సెన్సెక్స్​, బీఎస్​ఈ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 514 పాయింట్లు బలపడి 51,937 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 147 పాయింట్ల లాభంతో 15,582 వద్ద ముగిసింది. ప్రధానంగా బ్యాంకింగ్, అన్ని పెద్ద కంపెనీల షేర్లు లాభాలను గడించాయి.

కరోనా వ్యాప్తి తగ్గడం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. దీనికి తోడు అంతర్జాతీయ సానుకూల పవనాలతో సూచీలు లాభాల బాట పట్టాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 52,013 పాయింట్ల అత్యధిక స్థాయి, 51,476 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,606 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,374 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభ నష్టాల్లోనివి ఇవే..

  • ఐసీఐసీఐ బ్యాంక్​, రిలయన్స్​, భారతీ ఎయిర్​టెల్​, డాక్టర్​ రెడ్డీస్​, మారుతీ, ఐటీసీ, యాక్సిస్​ బ్యాంక్​, ​ షేర్లు లాభాలను గడించాయి.
  • ఎం అండ్​ ఎం, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, ఇన్ఫోసిస్, ఎల్​ అండ్​ టీ షేర్లు నష్టపోయాయి.
Last Updated :May 31, 2021, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details