తెలంగాణ

telangana

లాభాల్లో మార్కెట్లు- సెన్సెక్స్ 270 ప్లస్

By

Published : Jun 24, 2021, 9:31 AM IST

Updated : Jun 24, 2021, 10:51 AM IST

STOCKS LIVE
స్టాక్ మార్కెట్లు

10:08 June 24

తగ్గుతున్న కేసులు.. లాభాల్లో మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 271 పాయింట్లకు పైగా లాభపడి 52,577 వద్ద ట్రేడవుతోంది.  ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 67 పాయింట్లుకు పైగా పుంజుకుని 15,753 వద్ద కొనసాగుతుంది. 

వివిధ రాష్ట్రాల్లో కరోనా ఆంక్షల సడలింపు సహా..  రోజువారీ కేసుల తగ్గుదల, వేగవంతమైన టీకా కార్యక్రమంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నట్లు నిపుణులు విశ్లేషించారు. మూలధన మార్కెట్లో పెరిగిన విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ) సైతం మార్కట్ల లాభానికి కారణమని తెలిపారు.

09:10 June 24

స్టాక్​ మార్కెట్​ లైవ్

స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమమ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 171 పాయింట్ల లాభంతో 52,477 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 38 పాయింట్లు పుంజుకుని.. 15,729 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్​ 30 షేర్లలో టీసీఎస్, ఎల్​ అండ్ టీ, ఇన్ఫోసిస్ లాభాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్ ఆటో, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్, మారుతీ షేర్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Last Updated : Jun 24, 2021, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details