తెలంగాణ

telangana

వెంటాడిన కరోనా భయాలు- మార్కెట్లకు నష్టాలు

By

Published : Apr 9, 2021, 3:42 PM IST

స్టాక్​మార్కెట్​ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్ 154 పాయింట్ల నష్టంతో 49,591 వద్ద ముగిసింది. ఎన్​ఎస్​ఈ సూచీ నిఫ్టీ 38పాయింట్లు కోల్పోయి 14,834 వద్ద స్థిరపడింది.

indian stock markets closed with negative mark
లాభాల స్వీకరణతో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు శుక్రవారం సెషన్​ను నష్టాలతో ముగించాయి. ప్రారంభం నుంచి సూచీలు లాభనష్టాలతో దోబూచులాడాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 154పాయింట్లు కోల్పోయి 49,591 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 38 పాయింట్లకు పైగా నష్టంతో 14,834 వద్ద స్థిరపడింది.

దేశీయంగా కరోనా కేసుల విజృంభణ, వైరస్ కట్టడి కోసం లాక్‌డౌన్‌లు విధించడం మదుపర్లను కొంతమేర కలవరపెట్టాయి. వారాంతం కావడం వల్ల గత రెండు రోజుల లాభాలను మదుపర్లు సొమ్ము చేసుకొనే ప్రయత్నం చేశారు. దీంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

ఐటీ, ఫార్మా షేర్లు మొదటి నుంచి దూకుడు ప్రదర్శించాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 49,906 పాయింట్ల అత్యధిక స్థాయి, 49,461 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 14,918 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 14,785 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లో..

సన్​ఫార్మా, హిందుస్థాన్​ యూనిలివర్​, టెక్​ మహీంద్ర, డా.రెడ్డీస్​, కోటక్ మహీంద్ర బ్యాంక్​, హెచ్​సీఎల్​టెక్​ షేర్లు లాభాలతో ముగిశాయి.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్​టీపీసీ, యాక్సిస్​ బ్యాంక్, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, ఎల్​&టీ, ఎస్​బీఐ, పవర్​గ్రిడ్​ షేర్లు నష్టాలతో ముగించాయి.

ABOUT THE AUTHOR

...view details