తెలంగాణ

telangana

ఫెడ్​ నిర్ణయాలు, ఆర్థిక గణాంకాలే మార్కెట్లకు కీలకం!

By

Published : Mar 14, 2021, 12:42 PM IST

కీలక వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ నిర్ణయాలు, దేశీయంగా స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, ముడి చమురు ధరల్లో వృద్ధి వంటి అంశాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా ఉండనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

stocks market expectations for this week
ఈ వారం స్టాక్ మార్కెట్ల అంచనాలు

అమెరికా ఫెడ్ నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలు.. ఈ వారం దేశీయ మార్కెట్లను ముందుకు నడిపించనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

'కీలక వడ్డీ రేట్లపై ఈ వారం అమెరికా ఫెడ్ నిర్ణయం వెలువడనుంది. బాండ్​ మార్కెట్లలో ఇటీవలి ఒడుదొడుకుల నేపథ్యంలో ఫెడ్ నిర్ణయాలపై మార్కెట్​ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మదుపరులు కూడా ఈ అంశాన్ని కీలకంగా పరిగణించే అవకాశముంది.' అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

దేశీయంగా చూస్తే.. ఈ ఏడాది మొదటి నెలలో ఐఐపీ క్షీణించినట్లు, ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ భారీగా పెరిగినట్లు గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత విడుదలైన అధికారిక గణాంకాల్లో తేలింది. ఈ లెక్కలు మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సోమవారం టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా విడుదల కానున్నాయి. ఈ డేటాపైనా మదుపరులు దృష్టి సారించొచ్చని వివరిస్తున్నారు.

కరోనా, ముడిచమురు ధరలు కూడా..

కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతుండటం కూడా దేశీయంగా ఆందోళన కలిగిస్తున్న అంశమని.. దీని ప్రభావం కూడా మార్కెట్లపై ఉండొచ్చంటున్నారు మార్కెట్ బ్రోకర్లు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల మదుపరుల సెంటిమెంట్​పై ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు.

వీటిన్నింటితో పాటు డాలర్​తో రూపాయి మారకం విలువ, కరోనా వ్యాక్సినేషన్​ వార్తలు, ఇతర అంతర్జాతీయ ఈక్విటీల స్పందన కూడా దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చదవండి:'సానుకూలతలు కనిపిస్తున్నాయ్​- ఇదే సంకేతం'

ABOUT THE AUTHOR

...view details