తెలంగాణ

telangana

కరోనా అప్​డేట్స్, రుతుపవనాల వార్తలే కీలకం!

By

Published : Jun 6, 2021, 11:23 AM IST

ఈ వారం స్టాక్ మార్కెట్లకు కరోనా వార్తలు, అంతర్జాతీయ పరిణామాలు, ఇతర ఆర్థిక గణాంకాలు కీలకం కానున్నాయి. వీటన్నింటితో పాటు రుతుపవనాల రాకతో మార్కెట్లో సానుకూలతలు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Stocks expectations for this week
ఈ వారం స్టాక్ మార్కెట్​ అప్​డేట్స్​

కొవిడ్-19 ట్రెండ్స్​, వ్యాక్సినేషన్​ అప్​డేట్స్​, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్లను ముందుకు నడిపించనున్నాయంటున్నారు విశ్లేషకులు. కీలక పరిణామాలతో పాటు.. రుతుపవనాల రాక​, ఈ శుక్రవారం విడుదల కానున్న పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై మదుపరులు దృష్టి సారించొచ్చు అని రెలిగేర్​ బ్రోకింగ్ పరిశోధన విభాగ ఉపాధ్యక్షుడు అజిత్ మిశ్రా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మే నెల ఆరంభంతో పోలిస్తే భారీగా తగ్గిన నేపథ్యంలో రాష్ట్రాలు సడలింపు ఇవ్వొచ్చని అంచనా వేశారు. ఇవి మార్కెట్లో సానుకూలతలు పెంచొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

బాటా ఇండియా, గెయిల్​, సెయిల్​, బీహెచ్​ఈఎల్​, డీఎల్​ఎఫ్​ వంటి కంపెనీలు ఈ వారమే 2020-21చివరి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ ఫలితాల ప్రభావం ఆయా రంగాల షేర్లపై అధికంగా ఉండనుంది.

వీటితో పాటు.. బ్రెంట్ క్రూడాయిల్​ ధరలు, రూపాయి హెచ్చుతగ్గులు, విదేశీ మదుపరులు వ్యవహరించే తీరు కూడా మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చదవండి:ఆగని పెట్రో బాదుడు- ఆరు రోజుల్లో మూడోసారి

ABOUT THE AUTHOR

...view details