తెలంగాణ

telangana

జీవితకాల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం!

By

Published : May 17, 2021, 1:09 PM IST

ఏప్రిల్​లో టోకు ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో రెండంకెలపైకి చేరింది. టోకు ద్రవ్యోల్బణం పెరగటం వరుసగా ఇది 4వ నెల. డబ్ల్యూపీఐ గత నెల 10.49 శాతంగా నమోదైంది. మార్చిలో ఇది 7.39 శాతంగా ఉండటం గమనార్హం.

Whole sale price index in April
ఏప్రిల్​లో టోకు ద్రవ్యోల్బణం

టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఏప్రిల్​లో జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ముడి చమురు, తయారీ వస్తువుల ధరలు పెరిగిన కారణంగా టోకు ద్రవ్యోల్బణం ఏకంగా 10.49 శాతంగా నమోదైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.

ఈ ఏడాది మార్చిలో డబ్ల్యూపీఐ 7.39 శాతంగా నమోదవగా.. 2020 ఏప్రిల్​లో -1.57 శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. టోకు ద్రవ్యోల్బణం పెరగటం వరుసగా ఇది 4వ నెల.

  • ఆహార పదార్థాల టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్​లో 4.92 శాతంగా నమోదైంది. అధిక ప్రోటీన్లు ఉండే గుడ్లు, మాంసం, చేపల ధరలు పెరగటం ఇందుకు కారణం.
  • కూరగాయల టోకు ద్రవ్యోల్బణం గత నెల -9.03 శాతంగా నమోదైంది. మార్చిలో ఇది -5.19 శాతంగా ఉంది.
  • పప్పు ధాన్యాలు, పండ్ల టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్​లో వరుసగా 10.74 శాతం, 27.43 శాతంగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
  • ఇంధన, విద్యుత్​ డబ్ల్యూపీఐ 20.94 శాతంగా నమోదైంది. తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 9.01 శాతంగా ఉంది.

ఇదీ చదవండి:ఆ 14 గంటలు నెఫ్ట్​ సేవలు బంద్!

ABOUT THE AUTHOR

...view details