తెలంగాణ

telangana

'రూ.68 లక్షల కోట్లకు రాష్ట్రాల అప్పులు'

By

Published : Dec 2, 2020, 12:26 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్రాల అప్పులు భారీగా పెరగొచ్చని క్రిసిల్​ నివేదిక అంచనా వేసింది. కరోనాతో తగ్గిన ఆదాయం, పెరిగిన వ్యయాల వల్ల రాష్ట్రాల అప్పులు రూ.68 లక్షల కోట్లకు చేరొచ్చని వెల్లడించింది.

Debts of states that will increase massively due to corona
కరోనా వల్ల భారీగా పెరగనున్న రాష్ట్రాల అప్పులు

కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో రాష్ట్రాలు తీవ్రంగా కుదేలయ్యాయి. దీనితో రాష్ట్రాల అప్పులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 36 శాతం పెరిగి.. దశాబ్దపు గరిష్ఠ స్థాయి అయిన రూ.68 లక్షల కోట్లకు చేరొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. కొవిడ్ సంక్షోభం వల్ల రాష్ట్రాల ఆదాయాలు 2020-21లో 15 శాతం మేర తగ్గొచ్చని తాజా నివేదికలో పేర్కొంది.

2020-21లో రాష్ట్రాల నామినల్ జీడీపీ 2-4 శాతం క్షీణించొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది క్రిసిల్. కరోనా నేపథ్యంలో మార్చిలో విధించిన లాక్​డౌన్​ తర్వాత.. తగ్గిన జీఎస్​టీ వసూళ్లు, పెరిగిన రాష్ట్రాల వ్యయాల వంటివి ఈ పరిస్థితికి కారణంగా తెలిపింది. ఫలితంగా రాష్ట్రాల ఆదాయ లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6 శాతానికి, మూలధన వ్యయాలు 3.8 శాతానికి పెరగొచ్చని వెల్లడించింది.

దిల్లీ మినహా.. గోవాతో కలిపి స్థూల రాష్ట్రీయోత్పత్తి (జీఎస్​డీపీ)లో 90 శాతం వాటా కలిగిన 18 రాష్ట్రాల ఆర్థిక స్థితుల ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది క్రిసిల్.

ఇదీ చూడండి:సాంకేతిక రంగంలో 'ఆవిష్కరణ'తో అవకాశాల వెల్లువ

ABOUT THE AUTHOR

...view details