తెలంగాణ

telangana

మీ ఫోన్​తో ఫ్రీగా క్రెడిట్​ స్కోర్​ తెలుసుకోండిలా..

By

Published : Jul 23, 2021, 5:16 PM IST

మీరు బ్యాంకుల్లో లోన్​ లేదా క్రెడిట్​ కార్డ్ తీసుకోవాలంటే.. వారు ముందుగా చూసేది మీ క్రెడిట్​ స్కోరు. స్కోరు తక్కువగా ఉంటే.. మీకు లోన్​ ఇచ్చేందుకు బ్యాంకులు అంతగా సుముఖత చూపకపోవచ్చు. స్కోరు బాగుంటే మీ దరఖాస్తుకు వేగంగా ఆమోదం లభిస్తుంది. అంతలా ప్రభావితం చేస్తున్న ఈ క్రెడిట్​ స్కోరును(credit score check free) ఎలా తెలుసుకోవచ్చు? దీనిని ఎలా నిర్ణయిస్తారు? ఎలా దీనిని పెంచుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

How to know Credit score for free
క్రెడిట్​ స్కోర్​ తెలుసుకోవడం ఎలా

ప్రస్తుతం స్మార్ట్​ఫోన్​ ఉన్నవారు దాదాపు అంతా డిజిటల్​ పేమంట్​ యాప్స్ వాడటం సర్వ సాధారణమైంది. అయితే పేటీఎం వంటి యాప్​లు పేమెంట్​లు మాత్రమే కాకుండా.. పలు ఇతర సర్వీసులు కూడా అందిస్తున్నాయి. అందులో ఒకటి క్రెడిట్​ స్కోరు. పేటీఎం ప్రస్తుతం ఉచితంగానే క్రెడిట్​ స్కోరు(credit score check free) సేవలందిస్తోంది. దీనితో పాటు.. ఎన్ని యాక్టివ్​ క్రెడిట్​ కార్డ్​లు ఉన్నాయి, ఎన్ని సార్లు లోన్ ఎంక్వైరీ చేశారు, క్రెడిట్​ రేటింగ్​లో మీ పట్టణం, రాష్ట్రం, జాతీయ స్థాయిలో మీ స్థానం ఎక్కడ అనే వివరాలతో సమగ్ర నివేదికను కూడా పొందొచ్చు.

క్రెడిట్​ స్కోర్​ఎలా తెలుసుకోవాలి(credit score check online)?

  • ముందుగా మీ పేటీఎం అకౌంట్​లోకి లాగిన్ అవ్వాలి
  • హోం స్క్రీన్​లో More​ ఐకాన్ పై క్లిక్ చేయాలి
  • ఈ సెక్షన్​లో ఫ్రీ క్రెడిట్​ స్కోర్​ ఆప్షన్​ను ఎంచుకోవాలి
  • ఇక్కడ ఓ ఫారం ఓపెన్ అవుతుంది..
  • ఈ ఫారంలో పాన్​ కార్డ్ నంబర్​, పుట్టిన తేదీ (అవసరమైతేనే) నమోదు చేయాలి
  • మీరు మొదటి సారి ఈ ఫీచర్​ను వాడుతున్నట్లయితే మీ ఫోన్ నంబర్​కు ఓ ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా క్రెడిట్​ స్కోరు సహా సమగ్ర నివేదికను చూడొచ్చు.

ఏమిటీ సిబిల్​ స్కోర్​?

సిబిల్​ లేదా క్రెడిట్ స్కోర్​ను(credit score cibil) స్పష్టంగా వివరించాలంటే.. దానిని మీ ఫినాన్షియల్ రిపోర్ట్​ కార్డ్​ అనొచ్చు.

సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఇది.. 300 నుంచి 900 మధ్య ఉంటుంది.

ఎంత ఉంటే మంచిది?

  • 800పైన ఉందంటే.. అద్భుతంగా ఉందని అర్థం
  • 700-800 మధ్య ఉంటే బాగుంది అని
  • 600-700 మధ్య ఉంటే.. ఫర్వాలేదు కానీ జాగ్రత్త వహించాలి అని అర్థం చేసుకోవచ్చు.
  • 600 కన్నా తక్కువగా ఉంటే.. ప్రమాదక స్థాయిలో స్కోరు ఉందని అర్థం. వీరికి లోన్స్​ లభించడం కష్టమవుతుంది.

స్కోరు ఎక్కువ, తక్కువ ఎలా నిర్ణయిస్తారు?

స్కోరు ఎక్కువగా ఉందంటే దానర్థం.. మీరు అప్పులు (బ్యాంకులు, ఇతర రుణ సంస్థల్లో) తిరిగి చెల్లించే విషయంలో, రుణాల నిర్వహణ విషయంలో జాగ్రత్తగా ఉన్నారని అర్థం. ఇలా స్కోరు ఎక్కువగా ఉన్నవారు రుణ దరఖాస్తు చేసుకుంటే.. అందుకు త్వరగా ఆమోదం లభిస్తుంది.

స్కోరు తక్కువుంటే.. లోన్స్​ను సమయానికి తిరిగి చెల్లించడం లేదని లేదా లోన్స్ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారని ఈ నివేదిక చెబుతుంది. అందుకే వీరికి కొత్తగా రుణాలు మంజూరు అవ్వడం కష్టమవుతుంది.

క్రెడిట్‌ స్కోర్‌ను పెంచుకోవడం ఎలా?

నెలవారీ వాయిదాలను క్రమం తప్పకుండా సమయానికి చెల్లించాలి. ఆలస్యంగా చేసే చెల్లింపులను రుణ సంస్థలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అవసరం లేకుండా అప్పులు తీసుకోకూడ‌దు. అత్యవసర సమయాల్లోనే లోన్స్​ కోసం ప్రయత్నించాలి. క్రెడిట్‌ కార్డును క్రమ శిక్షణతో ఉపయోగించాలి. వాయిదా చెల్లింపుల్లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే రుణ చరిత్రపై ఆ ప్రభావం పడుతుంది. ఒకటి కంటే ఎక్కువగా క్రెడిట్‌ కార్డులు కలిగి ఉంటే లేదా కుటుంబ సభ్యులకు అదనపు కార్డును ఇచ్చి ఉంటే వాటికీ సమయానికి చెల్లింపులు జరపడం ఎంతో అవసరం. లేదంటే ఇది క్రెడిట్‌ స్కోర్‌ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. హామీగా ఉన్న వ్యక్తుల ఖాతాలను, సంయుక్తంగా నిర్వహించుకునే ఖాతాలను అప్పుడప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. ఒకవేళ వారు రుణాలను సక్రమంగా చెల్లించకపోతే ఆ ప్రభావం హామీదారుపై ఉంటుంది. హామీదారుకు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు తగ్గవచ్చు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details