తెలంగాణ

telangana

2020లో భారత వృద్ధి రేటు 1.9 శాతమే: ఐఎంఎఫ్​

By

Published : Apr 14, 2020, 8:26 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తోంది. ఇప్పటికే ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలోకి జారుకుందని పలు నివేదికలు చెబుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో భారత వృద్ధి రేటు 2020లో 1.9 శాతానికే పరిమితం అవుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ-ఐఎంఎఫ్​ తాజా అంచనాల్లో తెలిపింది.

corona impact on indian economy
భారత వృద్ధి రేటుపై కరోనా పడగ

కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత వృద్ధి రేటు అంచనాలను భారీగా తగ్గించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్). ఈ ఏడాది (2020) దేశ జీడీపీ వృద్ధి రేటు 1.9 శాతానికే పరిమితం కావచ్చని తాజాగా ప్రకటిచింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 వల్ల నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది.

ఆందోళన..

భారత్​లో 1991లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత అత్యధిక స్థాయిలో వృద్ధి రేటు క్షీణించే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్​ అభిప్రాయపడింది. అయితే గత నివేదికల్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతున్నట్లు పేర్కొనడం గమనార్హం.

మాంద్యం ఉన్నా..

ప్రస్తుత పరిస్థితుల్లోనూ భారత్​, చైనాలు మాత్రమే ప్రధానంగా సానుకూల వృద్ధి నమోదు చేయొచ్చని అంచనా వేసింది ఐఎంఎఫ్​. 2020లో భారత్ 1.9 శాతం, చైనా 1.2 శాతం వృద్ధి రేటును సాధించే వీలుందని తెలిపింది.

వచ్చే ఏడాది ఆశాజనకమే..

కరోనా కారణంగా ఈ ఏడాది పలు దేశాల వృద్ధి రేటు కనిష్ఠ స్థాయికి పడిపోయినా 2021లో తిరిగి పుంజుకుంటాయని ఐఎంఎఫ్ ఆశాభావం వ్యక్తం చేసింది. 2021లో భారత్​ 7.4 శాతం, చైనా 9.2 శాతం అమెరికా 4.5 శాతం, జపాన్​ 3 శాతం వృద్ధి రేటును నమోదు చేయొచ్చని వెల్లడించింది.

మరిన్ని దేశాల వృద్ధి రేటు అంచనాలు ఇలా...

దేశం వృద్ధి రేటు అంచనా
అమెరికా -5.9 శాతం
జపాన్​ -5.2 శాతం
బ్రిటన్ -6.5 శాతం
జర్మనీ -7.0 శాతం
ఫ్రాన్స్ -7.2 శాతం
ఇటలీ -9.1 శాతం
స్పెయిన్​ -8.0 శాతం
రష్యా -5.5 శాతం

ఇదీ చూడండి:కరోనాపై పోరుకు శాంసంగ్ ఇండియా రూ.20 కోట్ల విరాళం

ABOUT THE AUTHOR

...view details