తెలంగాణ

telangana

'2020-21లో భారత వృద్ధి రేటు 0.8 శాతమే'

By

Published : Apr 23, 2020, 12:46 PM IST

కరోనాతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత వృద్ధి రేటు 0.8 శాతానికే పరిమితం కావచ్చని ఫిచ్‌ రేటింగ్స్ అంచనా వేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

corona effect on India growth
భారత జీడీపీపై కోరనా పడగ

కరోనా నేపథ్యంలో భారత వృద్ధి రేటు అంచనాను భారీగా తగ్గించింది ఫిచ్‌ రేటింగ్స్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) దేశ జీడీపీ 0.8 శాతానికే పరిమితం కావచ్చని తాజా అంచనాల్లో వెల్లడించింది. ఇంతకు ముందు అంచనాల్లో భారత్ 4.9 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని పేర్కొనడం గమనార్హం.

కరోనా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు క్షీణించినా వచ్చే ఆర్థిక సంవత్సరం ఆశాజనకంగా ఉన్నట్లు ఫిచ్ నివేదిక పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) భారత్ 6.7 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని లెక్కగట్టింది.

ప్రపంచ వృద్ధిపైనా కరోనా పడగ..

కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో 2020లో ప్రపంచ వృద్ధి రేటు 3.9 శాతం మేర తగ్గొచ్చని అంచనా వేసింది ఫిచ్‌ రేటింగ్స్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు యుద్ధకాల అనంతరం ఇదే అతిపెద్ద సంక్షోభమని పేర్కొంది. 2009 ఆర్థిక మాంద్యంతో పోలిస్తే ఇది రెండింతలు పెద్దదని అభిప్రాయపడింది.

ఇదీ చూడండి:'కరోనా సంక్షోభంతో భారత్‌పై ప్రపంచ కంపెనీల దృష్టి'

ABOUT THE AUTHOR

...view details