తెలంగాణ

telangana

అక్టోబర్​ 1 నుంచి టాటా వాహనాల ధరలు పెంపు

By

Published : Sep 21, 2021, 3:21 PM IST

Tata motors Price hike again

టాటా మోటార్స్ మరోసారి తమ వాహనాల ధరలు పెంచుతున్నట్లు (Tata Motors Price hike) ప్రకటించింది. మోడల్​ను బట్టి ధరలో పెరుగుదల ఉంటుందని తెలిపింది. వచ్చే నెల నుంచే కొత్త ధరలు (Tata Motors new prices) అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్​ మరోసారి ధరల పెంపు (Tata Motors Price hike) నిర్ణయం తీసుకుంది. వాణిజ్య వాహనాల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. కొత్త ధరలు అక్టోబర్ 1 నుంచే (Tata Motors new Prices) అమలులోకి రానున్నట్లు వెల్లడించింది.

ముడి సరకు ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరగటం వల్ల.. వాహనాల ధరల పెంపు తప్పడం లేదని టాటా మోటర్స్​ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉత్పత్తి వ్యయాలు కాస్త తగ్గించుకున్నట్లు కూడా వివరించింది.

ఏడాది కాలంగా.. ఉక్కు సహా ఇతర విలువైన లోహాల ధరలు పెరగుతూ వస్తున్నాయి. ఈ కారణంగా ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలను పెంచుతున్నాయి.

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఈ నెల ఆరంభంలో పలు మోడళ్ల ధరను 1.9 శాతం మేర (Maruti Suzuki Price hike) పెంచింది. మారుతీ కార్ల ధరలను పెంచడం ఏడాది కాలంలోనే ఇది మూడోసారి.

ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ (Hero MotoCorp price hike )​ ఈ ఏడాది మూడు సార్లు బైక్​ల ధరలు పెంచింది.

ఇతర వాహన సంస్థలు కూడా ఈ ఏడాది ఇప్పటికే పలుమార్లు ధరలు పెంచాయి. ధరలు పెంపునకు అన్ని సంస్థలు చెప్పిన కారణాలు.. ముడి సరకు ఖర్చులు పెరగటమే కావడం గమనార్హం.

ఇదీ చదవండి:Munich Auto Show: వాహన యంత్ర.. విద్యుత్‌ మంత్ర

ABOUT THE AUTHOR

...view details