తెలంగాణ

telangana

కరోనా భయాలున్నా లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

By

Published : Mar 18, 2020, 9:28 AM IST

కరోనా భయాలున్నా స్టాక్ మార్కెట్లు నేడు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 132 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 34 పాయింట్ల వృద్ధితో కొనసాగుతోంది.

stock markets today
నేటి స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి. కరోనా భయాలు కొనసాగుతున్నప్పటికీ సూచీలు సానుకూలంగా స్పందిస్తుండటం విశేషం. కొవిడ్​19 ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఆర్బీఐ సహా ఇతర దేశాల కేంద్ర బ్యాంకులు తీసుకుంటున్న చర్యలు లాభాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 132 పాయింట్లకు పైగా లాభంతో.. ప్రస్తుతం 30,711 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 34 పాయింట్లకు పైగా వృద్ధితో 9,001 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివివే..

ఇండస్​ఇండ్ బ్యాంకు, సన్​ఫార్మా, ఇన్ఫోసిస్​, టాటా స్టీల్​, టీసీఎస్​, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే ఇండియా, పవర్​ గ్రిడ్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details