తెలంగాణ

telangana

లాభాలతో ముగిసిన మార్కెట్లు.. 39 వేల పైకి సెన్సెక్స్​

By

Published : Aug 26, 2020, 9:47 AM IST

Updated : Aug 26, 2020, 3:46 PM IST

stock-market-indices-open-flat
ఫ్లాట్​గా స్టాక్​మార్కెట్ సూచీలు

15:44 August 26

నిఫ్టీ@11,550

స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు పెరిగి 39,074 వద్దకు చేరింది. సెన్సెక్స్ 39 వేల స్థాయికి చేరడం లాక్​డౌన్ తర్వాత ఇదే ప్రథమం. నిఫ్టీ 77 పాయింట్ల లాభంతో 11,550 వద్ద స్థిరపడింది.

బ్యాంకింగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.

  • ఇండస్​ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. 
  • భారతీ ఎయిర్​టెల్​, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్​ పెయింట్స్, మారుతీ, హెచ్​డీఎఫ్​సీ, ఎల్​&టీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

14:16 August 26

నష్టాల నుంచి లాభాల్లోకి..

స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల నుంచి తేరుకుని లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 80 పాయింట్లకుపైగా వృద్ధిచెంది 38,929 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా లాభంతో 11,515 వద్ద కొనసాగుతోంది.

బ్యాంకింగ్ షేర్లు భారీగా పుంజుకోవడం లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. రిలయన్స్ వంటి హెవీ వెయిట్ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

  • ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, కోటక్ బ్యాంక్, ఎం&ఎం షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • భారతీ ఎయిర్​టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్​ పెయింట్స్ ఎల్​&టీ, మారుతీ, టెక్​ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:41 August 26

ఎయిర్​టెల్ 2 శాతం డౌన్..

స్టాక్ మార్కెట్లు మిడ్​ సెషన్​ ముందు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. లాభాల స్వీకరణతో పాటు, ఆగస్టు డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగుస్తుండటం వల్ల సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

సెన్సెక్స్ ప్రస్తుతం 20 పాయింట్లకుపైగా స్వల్ప నష్టంతో 38,819 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 11,474 వద్ద ఫ్లాట్​గా కొనసాగుతోంది.

బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐటీ, విద్యుత్ ఎఫ్​ఎంసీజీ, మౌలిక సదుపాయాల రంగాలు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. 

  • ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, కోటక్ బ్యాంక్, ఎం&ఎం షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • భారతీ ఎయిర్​టెల్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఎల్​&టీ, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:39 August 26

ఫ్లాట్​గా స్టాక్​మార్కెట్ సూచీలు

అంతర్జాతీయంగా మిశ్రమ స్పందనల నేపథ్యంలో స్టాక్ మార్కెట్​ సూచీలు ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి. తొలుత 83 పాయింట్లు వృద్ధి చెందిన సెన్సెక్స్​ కాసేపటికే 51 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 38,798 పాయింట్ల వద్ద ఉంది. నిఫ్టీ స్థిరంగా 11,471 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.3గా ఉంది.

Last Updated :Aug 26, 2020, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details