తెలంగాణ

telangana

భారత్‌కు మళ్లీ 'బీబీబీ' రేటింగే

By

Published : Jul 14, 2021, 7:01 AM IST

భారత్​కు 'బీబీబీ' రేటింగ్‌ను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రముఖ రేటింగ్​ సంస్థ ఎస్​అండ్​పీ పేర్కొంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినా.. ఈ ఏడాది రెండో అర్ధభాగం నుంచి ఆర్థిక వ్యవస్థ వృద్ధి పుంజుకోవడం ప్రారంభం కావొచ్చనే అంచనాతో రేటింగ్‌ భవిష్యత్‌ అంచనాను 'స్థిరత్వం'గా ఉంచుతున్నట్లు వెల్లడించింది.

S&P india ratings
ఎస్​ అండ్​ పీ భారత్​ రేటింగ్స్

భారత్‌కు వరుసగా 14వ సంవత్సరమూ తక్కువ పెట్టుబడుల గ్రేడ్‌ను అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ కొనసాగించింది. మళ్లీ బీబీబీ-రేటింగ్‌ను యథాతథంగా ఉంచుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం చాలా ముఖ్యమని తెలిపింది. పెట్టుబడులను పెంచేందుకు, ఉద్యోగాల సృష్టికి అదనపు ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 9.5%, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 7.8% వృద్ధి రేటును ఎస్‌అండ్‌పీ అంచనా వేసింది. 2019-20లో 2.87 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) ఆ తర్వాతి సంవత్సరం 2.66 లక్షల కోట్ల డాలర్లకు తగ్గిందని, 2024-24లో ఇది 3.96 లక్షల డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే 2021-22 రెండో అర్ధభాగం నుంచి ఆర్థిక వ్యవస్థ వృద్ధి పుంజుకోవడం ప్రారంభం కావొచ్చనే అంచనాతో రేటింగ్‌ భవిష్యత్‌ అంచనాను 'స్థిరత్వం'గా పేర్కొంది. అయితే ఆర్థిక రంగంలోని బలహీనతలు, ప్రైవేట్‌ పెట్టుబడుల్లో స్తబ్దత లాంటి సమస్యలను సమర్థంగా ఎదుర్కొనకపోతే ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు ఎదురుకావొచ్చని వివరించింది.

ABOUT THE AUTHOR

...view details