తెలంగాణ

telangana

మళ్లీ పెట్రో వాత.. లీటరుపై 11 పైసలు పెంపు

By

Published : Aug 28, 2020, 10:23 AM IST

పెట్రోల్​ ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం లీటరు పెట్రోల్​పై 11పైసలు పెంచాయి చమురు సంస్థలు. దిల్లీలో లీటరు పెట్రోలు రూ.81.94కు చేరింది. మరోవైపు డీజిల్​ ధరల స్థిరంగా కొనసాగుతుండటం విశేషం.

Petrol price
మళ్లీ పెట్రో వాత

పెట్రో ధరల వాత కొనసాగుతోంది. గడచిన 13 రోజుల్లో 11 సార్లు పెట్రోల్‌ ధరను పెంచాయి చమురు సంస్థలు. శుక్రవారం లీటరు పెట్రోల్‌పై 11 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్‌ రూ.81.94 కి చేరింది. 13 రోజుల్లో చమురు సంస్థలు లీటరు పెట్రోలుపై రూ.1.51 పైసలు పెంచాయి.

మరోవైపు గత కొన్ని రోజులుగా డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతుండటం విశేషం. డీజిల్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు. దిల్లీలో ప్రస్తుతం లీటర్‌ డీజిల్‌ ధర రూ.73.56పైసలుగా ఉంది.

ఇదీ చూడండి: 'నీరవ్​ మోదీ' కేసుపై తీర్పు వెలువడేది అప్పుడే!

ABOUT THE AUTHOR

...view details