తెలంగాణ

telangana

పాన్-ఆధార్‌ను లింక్ చేయ‌డం ఎలా..?

By

Published : Mar 28, 2021, 9:35 AM IST

పాన్​కార్డును ఆధార్​తో అనుసంధానించేందుకు మార్చి31 చివరి తేదీ. ఈ నెలాఖ‌రు లోపు లింక్ చేయ‌డం మంచిది. లేకపోతే రూ.1000 ఆలస్య రుసుం చెల్లించాల్సి ఉంటుంది. పాన్ కార్డుతో, ఆధార్‌ను లింక్ చేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

link PAN with Aadhaar
పాన్ - ఆధార్‌ లింక్

పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించేందుకు చివ‌రి తేదీ మార్చి 31. ఈ గ‌డువు లోపు లింక్ చేయ‌క‌పోతే రూ.1000 ఆల‌స్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేర‌కు 2021 ఆర్థిక బిల్లులో ప్రభుత్వం కొత్త సెక్షన్ 234 హెచ్‌ను ప్రవేశపెట్టింది. ఇంత‌వ‌ర‌కు పాన్‌- ఆధార్‌‌ లింక్ చేయ‌ని వారు ఈ నెలాఖ‌రు లోపు లింక్ చేయ‌డం మంచిది. పాన్ కార్డుతో, ఆధార్‌ను లింక్ చేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

పాన్‌తో ఆధార్‌ అనుసంధానం ఇలా..

  1. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ తెరవండి.
  2. మొద‌టిసారి లాగిన్ అయ్యే వారు రిజిస్ట‌ర్ చేసుకోవాలి. మీ పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) మీ యూజర్ ఐడీ అవుతుంది.
    పాన్ - ఆధార్‌ను లింక్
  3. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ అవ్వండి.
  4. ఆధార్‌-పాన్ లింక్ కోసం ఒక పాప్‌-అప్ విండో ఓపెన్ అవుతుంది.
  5. పాన్ కార్డులోని వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ వంటి స‌మాచారం క‌నిపిస్తుంది.
  6. స్క్రీన్‌పై క‌నిపిస్తున్న పాన్ కార్డు వివ‌రాల‌ను ఆధార్‌లో పేర్కొన్న వివరాల‌తో ధ్రువీకరించుకోవాలి. ఒకవేళ వివ‌రాల‌లో ఏమైనా తేడాలు ఉంటే రెండింటిలో ఒకే విధంగా ఉండేలా సరి చేసుకోవాలి.
  7. వివరాలు సరిపోలితే, మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి " లింక్ నౌ " బటన్ పై క్లిక్ చేయండి.
  8. మీ ఆధార్, పాన్‌తో విజ‌య‌వంతంగా లింక్ అయిన‌ట్లు పాప్-అప్ విండోతో సందేశం వ‌స్తుంది.
  9. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్ పేజీలో క‌నిపిస్తున్న‌ "లింక్ ఆధార్" పై క్లిక్ చేయడం ద్వారా కూడా నేరుగా అనుసంధానించ‌వ‌చ్చు.
    పాన్ - ఆధార్‌ను లింక్
  10. https://www.utiitsl.com/ లేదా https://www.egov-nsdl.co.in/ వెబ్‌సైట్‌ల ద్వారా కూడా ఆధార్, పాన్‌ల‌ను లింక్ చేసుకోవ‌చ్చు.

ఇదీ చదవండి:'పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details