తెలంగాణ

telangana

ద్రవ్యోల్బణం లెక్కలు, ఫెడ్ ప్రకటనలే కీలకం!

By

Published : Dec 13, 2020, 12:47 PM IST

ద్రవ్యోల్బణం గణాంకాలు, అమెరికా ఫెడ్​ నిర్ణయాలు దేశీయ స్టాక్​ మార్కెట్లకు ఈ వారం దిశా నిర్దేశం చేయనున్నాయి. బ్రెగ్జిట్ ఒప్పందంపై వెలువడే ప్రకటనలు కూడా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే కీలక అంతర్జాతీయ అంశాలుగా ఉండనున్నాయి. వీటన్నింటితో పాటు ఈ వారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్​పై నిపుణుల అంచనాలు ఇలా ఉన్నాయి.

STOCKS THIS WEEK
ఈ వారం స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలు

స్టాక్ మార్కెట్లను ఈ వారం స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా ఫెడ్ నిర్ణయాలు ప్రధానంగా ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ వారం ద్రవ్యోల్బణం, ఎగుమతి దిగుమతుల గణాంకాలు విడుదల కానున్నాయి. దేశీయంగా ఈ గణాంకాలపైనే మదుపరులు ఎక్కువగా దృష్టి సారించే అవకాశముందని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.

అంతర్జాతీయంగా చూస్తే.. బ్రెగ్జిట్ ఒప్పందం అప్​డేట్లు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు, ఇతర ఆర్థిక అంశాలపై చేసే ప్రకటనలు మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయని జియోజిత్ ఫినాన్షియల్​ సర్వీసెస్ అధిపతి (రీసెర్చ్) వినోద్ నాయర్ తెలిపారు.

కరోనా వ్యాక్సిన్​ ప్రకటనలు, వృద్ధి రేటు రికవరీపై సానుకూల అంచనాల నేపథ్యంలో.. ఈ వారం కూడా మార్కెట్లు ఇంకా ముందుకే సాగొచ్చని మోతీలాల్​ ఓస్వాల్​ ఫినాన్షియల్ సర్వీసెస్ అధిపతి (రిటైల్ రీసెర్చ్) సిద్ధార్థ్ ఖింకా తెలిపారు. అయితే అంతర్జాతీయ పరిణామాల వల్ల కొంత ఒడుదొడుకులకు అవకాశం లేకపోలేదని వివరించారు.

వీటన్నింటితో పాటు ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చూడండి:స్టాక్‌ మార్కెట్లోకి నీరు!!

ABOUT THE AUTHOR

...view details