తెలంగాణ

telangana

పండుగ ఆఫర్లు- కార్లపై హోండా  భారీ డిస్కౌంట్​!

By

Published : Sep 6, 2021, 7:10 PM IST

దేశవ్యాప్తంగా పండుగల సీజన్​ ప్రారంభమవనున్న నేపథ్యంలో హోండా కార్​ ఇండియా (Honda car India) భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు లేదా స్టాక్​ పూర్తయ్యే వరకు వివిధ మోడళ్లపై రూ.57 వేల వరకు డిస్కౌంట్ (Honda car offers)​, ఎక్స్ఛేంజ్​ ఆఫర్​, యాక్ససరీస్ వంటి ఆఫర్లతో ముందుకొచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...

Honda Discount on All models
హోండా కార్లపై డిస్కౌంట్లు

రాబోయేది పండగల సీజన్‌. సాధారణంగా వినియోగదార్లు దసరా, దీపావళి పండగల సమయంలో కొత్త కార్లు డెలివరీ తీసుకోవడానికి ఇష్టపడతారు. అధికంగా అమ్మకాలు నమోదయ్యేది కూడా ఈ సీజన్లోనే. దీంతో కష్టమర్లను ఆకట్టుకునేందుకు వ్యాపార సంస్థలు వివిధ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఈ క్రమంలో 'హోండా కార్‌ ఇండియా' (Honda car India) రూ.57,000 వరకు ప్రయోజనాలను అందించేందుకు సిద్ధమైంది. ఈ మొత్తంలో కొంత రాయితీ, ఉచితంగా యాక్సెసరీస్‌, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ వంటి ప్రయోజనాలు (Honda cars Offers) ఉన్నాయి. ఈ ప్రయోజనాలను సెప్టెంబరు 30, లేదా స్టాక్‌ పూర్తయ్యే వరకు అందించనున్నారు.

హోండా అమేజ్‌పై రూ.57,044..

హోండా అమేజ్‌

హోండా అమేజ్ ప్రి-ఫేస్‌లిఫ్ట్‌పై గరిష్ఠంగా రూ.57,044 వరకు రాయితీ ఇస్తున్నారు. ఎస్‌ఎంటీ పెట్రోల్‌ ట్రిమ్‌పై రూ.20,000 నగదు రాయితీ లేదా రూ.24,044 విలువ చేసే ఎఫ్‌ఓసీ యాక్సెసరీస్‌ ఇస్తున్నారు. కారు ఎక్సేంజీ కింద మరో రూ.15,000 వరకు రాయితీ పొందొచ్చు. వీ ఎంటీ, వీఎక్స్‌ ఎంటీ గ్రేడ్‌ కార్లపై రూ.5,000 వరకు నగదు రాయితీ లేదా రూ.5,998 విలువ చేసే ఎఫ్‌ఓసీ యాక్సెసరీస్‌ లభిస్తాయి. కారు ఎక్స్‌ఛేంజ్‌ కింద రూ.10,000 వరకు పొందవచ్చు. లాయల్టీ బోనస్ కింద మరో రూ.5 వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. సబ్‌కాంపాక్ట్‌ సెడాన్‌పై మరో రూ.4,000 రాయితీ లభించనుంది. అయితే, అమేజ్‌ 2021పై మాత్రం గరిష్ఠంగా రూ.18,000 వరకు మాత్రమే ప్రయోజనాలు లభిస్తాయి.

హోండా జాజ్‌పై రూ.39,947...

హోండా జాజ్​

హోండా జాజ్‌పై అన్నీ కలుపుకొని రూ.39,947 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. నగదు రాయితీ కింద రూ.10,000 లేదా రూ.11,947 యాక్సెసరీస్‌ పొందొచ్చు. కారు ఎక్స్‌ఛేంజ్‌ కింద రూ.10,000 రాయితీ ఉంది. లాయల్టీ బోనస్‌ కింద రూ.5,000, హోండా కారు ఎక్స్‌ఛేంజ్‌ కింద రూ.9,000 రాయితీ లభిస్తుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌పై అదనంగా మరో రూ.4,000 కార్పొరేట్‌ డిస్కౌంట్‌ ఇస్తున్నారు.

హోండా డబ్ల్యూఆర్‌-వీపై రూ.39,998

హోండా డబ్ల్యూఆర్‌-వీ

హోండా డబ్ల్యూఆర్‌-వీపై గరిష్ఠంగా రూ.39,998 వరకు ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ఇందులో నగదు రాయితీ రూ.10,000 లేదా రూ.11,998 విలువ చేసే యాక్సెసరీస్‌, కారు ఎక్స్‌ఛేంజ్‌పై రూ.10,000, లాయల్టీ బోనస్‌ రూ.5,000, కార్పొరేట్‌ బోనస్‌ రూ.4,000, హోండా కారు ఎక్స్‌ఛేంజ్‌ డిస్కౌంట్‌ రూ.9,000 వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

హోండా సిటీపై రూ.37,708

హోండా సిటీ

ఐదో తరం హోండా సిటీ సెడాన్‌పై మొత్తం రూ.37,708 విలువ చేసే ప్రయోజనాల్ని ఇస్తున్నారు. ఇందులో రూ.10,000 నగదు రాయితీ, రూ.10,708 విలువ చేసే యాక్సెసరీలు ఉన్నాయి. అలాగే కారు ఎక్స్‌ఛేంజ్‌పై రూ.5,000 వరకు రాయితీ పొందొచ్చు. లాయల్టీ బోనస్‌ రూ.5,000, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ రూ.8,000, హోండా కారు ఎక్స్‌ఛేంజ్‌ రూ.9,000 వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇక నాలుగో తరం సిటీపై రూ.22,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి.

ఇదీ చదవండి:పెరిగిన మారుతీ కార్ల ధరలు- ఏ మోడల్​పై ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details