తెలంగాణ

telangana

'నిబంధనల భారాన్ని తగ్గిస్తాం'

By

Published : Dec 21, 2021, 5:50 AM IST

Updated : Dec 21, 2021, 8:27 AM IST

ముందస్తు బడ్జెట్‌ సంప్రదింపుల్లో భాగంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్‌ దిగ్గజాలతో సమావేశమయ్యారు. ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఊతమిచ్చే చర్యలకు కట్టుబడి ఉన్నామని చెబుతూ, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని వారికి వివరించారు.

modi
మోదీ

నిబంధనల భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని, ఏవేవి పరిహరించవచ్చో తెలపాలని కార్పొరేట్లకు ప్రధాని సూచించారు. ముందస్తు బడ్జెట్‌ సంప్రదింపుల్లో భాగంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్‌ దిగ్గజాలతో సమావేశమయ్యారు. ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఊతమిచ్చే చర్యలకు కట్టుబడి ఉన్నామని చెబుతూ, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని వారికి వివరించారు. ప్రతి రంగంలో ప్రపంచంలోని ఉత్తమ 5 కంపెనీల్లో భారత్‌కు చోటుండేలా సమష్ఠిగా కృషి చేద్దామని పేర్కొన్నారు. వ్యవసాయం, ఆహార శుద్ధి లాంటి రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారని వెల్లడించింది.

  • ప్రభుత్వ సత్వర చర్యల వల్లే కొవిడ్‌-19 పరిణామాల నుంచి కోలుకుని, వి-ఆకారపు వృద్ధిని ఆర్థిక వ్యవస్థ నమోదుచేస్తోందని టాటా స్టీల్‌ సీఈఓ టి.వి.నరేంద్రన్‌ తెలిపారు.
  • ఆహార శుద్ధి పరిశ్రమకు మరింత ఊతమిచ్చే చర్యలపై ఐటీసీ సీఈఓ సంజీవ్‌ పురి పలు సూచనలు చేశారు.
  • పరిశోధన, ఆవిష్కరణలకు ప్రధాని ప్రాధాన్యం ఇస్తున్నారని టీసీఎస్‌ సీఈఓ రాజేశ్‌ గోపీనాధన్‌ తెలిపారు.
  • భయాలకు తావు లేకుండా అభివృద్ధిపైనే భారత కంపెనీలు సమాలోచన జరపాలని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సీఈఓ ఉదయ్‌ కోటక్‌ తెలిపారు.
  • దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడపడంపైనే చర్చ సాగిందని ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్స్‌ ఛైర్మన్‌, ఎండీ మల్లికా శ్రీనివాసన్‌ చెప్పారు.
  • భారత్‌ను తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని స్వప్నాన్ని సాకారం చేసేందుకు పరిశ్రమ పూర్తిగా కట్టుబడి ఉందని మారుతీ సుజుకీ సీఈఓ కెనిచి ఆయుకవా తెలిపారు.
Last Updated : Dec 21, 2021, 8:27 AM IST

ABOUT THE AUTHOR

...view details